టాలీవుడ్ అందాల కథానాయిక హన్సిక ప్రస్తుతం చేతిలో పెద్దగా సినిమాలు లేకపోయినా కూడా సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలు పెడుతూ తన అభిమానులను ఎంతగానో ఆకర్షిస్తున్న హన్సిక తమిళంలో వరుస సినిమాలు చేసుకుంటూ పోతుంది. కాగా తాజాగా తెలుగులో కూడా ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. దేశముదురు సినిమా ద్వారా టాలీవుడ్ కి అడుగు పెట్టిన హన్సిక తర్వాత వరుస స్టార్ హీరోల సినిమాలలో నటించి తన అందచందాలతో, గ్లామర్ తో, నటనతో ప్రేక్షకులను ఎంతగానో మంత్రముగ్ధులను చేసింది.

అయితే తెలుగులో పెద్ద హీరోల సరసన చేసిన కూడా ఆమెకు తగిన గుర్తింపు అయితే రాలేదు. దాంతో క్రమక్రమంగా ఆమె సినిమాలు చేయడం తగ్గిస్తూ వచ్చింది. ప్రస్తుతం ఆమె తెలుగులో పెద్ద హీరోల సరసన నటించడం చాలా తక్కువ అయింది. ఈ నేపథ్యంలోనే ఆమె మై నేమ్ ఈజ్ శృతి అనే సినిమాలో నటించడం మొదలు పెట్టింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆమెకు హిట్టు ఇస్తుందని నమ్మకాన్ని వ్యక్తం చేస్తుంది. ఆదివారం హైదరాబాద్ లో లాంఛనంగా ఈ సినిమాకి ఓంకార్ శ్రీనివాస్ అనే దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడు. వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై రమ్య బూరుగు, నాగేంద్ర రాజు నిర్మిస్తున్నారు. 

ప్రస్తుతం కొంతమంది హీరోయిన్ లు వెబ్ సిరీస్ ల  బాట పడుతున్న నేపథ్యంలో ఈమె కూడా నషా అనే ఓ వెబ్ సిరీస్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరించడానికి త్వరలోనే వస్తుంది. ఇదే కాకుండా మరో తమిళ సినిమాతో కూడా ఆమె త్వరలోనే ఎంట్రీ ఇవ్వబోతోంది. తెలుగులోనే ఆమె కెరీర్ ప్రారంభించగా లేడి ఓరియెంటెడ్ సినిమాలను కూడా తెలుగులోనే ప్రారంభిస్తున్నట్లు ఆమె తెలిపింది. నయనతార లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో దూసుకుపోతుండగా, తమన్నా లాంటి సీనియర్ హీరోయిన్ లు కూడా వెబ్ సీరీస్ లతో హీరోయిన్ బిజీగా ఉన్నారు కాబట్టి ఇదే బాటలో హన్సిక వేసిన ఈ అడుగు ఆమెకు ఏ రేంజ్ అదృష్టాన్ని తెస్తుంది అనేది చూద్దాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: