టాలీవుడ్లో హీరో ల కన్ఫ్యూజన్ కి చాలా మంది డైరెక్టర్లు బలవుతున్నారు.  ఆ విధంగా ఇప్పటి వరకు ఎంతో మంది డైరెక్టర్లు తమ విలువైన కాలాన్ని వృధా చేసుకున్నారు. హిట్టు వచ్చినా కూడా హీరోల డేట్స్ కోసం ఏళ్ల తరబడి వెయిట్ చేసి చివరికి నో చెప్పడంతో వారు వేరే సినిమా కి వెళ్ళ లేక, ఉన్న సినిమా ను వదల్లేకపోతున్నారు. ఆ విధంగా సాహో సినిమా తో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న సుజిత్ చిరంజీవి లూసిఫర్ రీమేక్ చేస్తాడని అని అందరూ భావించారు కానీ చిన్న పొరపాటు వల్ల ఆ ప్రాజెక్టు నుంచి బయటికి వచ్చేశాడు. 


 ఆ సినిమా కోసం ఆయన సంవత్సరం నుంచి పడ్డ కష్టమంతా వృథా అయిపోయింది. ఇప్పుడు ఏ సినిమా అనౌన్స్ చేయలేదు. మరి ఎందుకు చేయలేదు కూడా అర్థం కావడం లేదు. ఇక మరో దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా ఇదే లిస్ట్ లో ఉన్నారు. మహర్షి సినిమా కోసం ఏకంగా మూడు సంవత్సరాలు వెయిట్ చేయించాడు మహేష్ బాబు వంశీ పైడిపల్లి నీ. ఆ సినిమా తరువాత మరో సినిమాలో అవకాశం ఇస్తానని కూడా ఒక సంవత్సరం వెయిట్ చేయించి చివరికి నో చెప్పాడు. దాంతో వంశీ పైడిపల్లి ఏం చేయాలో అర్థం కాక తమిళ హీరోల వైపు వెళ్లి అక్కడ స్టార్ హీరో అయిన విజయ్ దళపతి తో సినిమా ఓకే చేయించుకున్నాడు. 

ఇప్పుడు నాగ్ అశ్విన్ పరిస్థితి కూడా ఇలానే తయారవుతుంది అంటున్నారు ఆయన అభిమానులు. ప్రభాస్ తో సైంటిఫిక్ థ్రిల్లర్ చిత్రం ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రభాస్ చాలా సినిమాలు ఒప్పుకోవడం తో ఈ సినిమా ఎప్పుడు వస్తుందో అని ఎదురుచూస్తూ ఉన్నారు.  ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. సలార్ సగానికిపైగా పూర్తికాగా అదిపురుష్ పూర్తి కాగానే నాగ్ అశ్విన్ సినిమా మొదలవుతుంది అనుకున్నారు కానీ మధ్యలో మరో దర్శకుడు ప్రభాస్ ను మెప్పించడం తో నాగ్ అశ్విన్ సినిమా కంటే ముందే ఆ సినిమాను తెరకెక్కించాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగ్ అశ్విన్  సినిమా మరికొన్ని రోజులు పోస్ట్ పోన్ అయినట్లు అయింది. మరి ఈ సైంటిఫిక్ థ్రిల్లర్ సినిమ  కోసం ఎన్ని రోజులు వెయిట్ చేయాలో చూద్దాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: