సినిమా వాళ్ళనే కాదు ఈ మధ్య చాలా మంది పెళ్లిళ్లు తుమ్మితే ఊడిపోయే పరిస్థితిలో ఉన్నాయి. ఎప్పుడు విడిపోతారో ఎప్పుడు కలుస్తారో అన్న విధంగా వారి బంధాలు ఉన్నాయి. అయితే ఈ తరహా విడాకులు తీసుకునే పద్ధతి ఎక్కువగా సినిమాల్లోనే వినబడుతుంది అని చాలా మంది అభిప్రాయం. సినిమా వాళ్ళ పెళ్లిళ్లు ఎందుకు నిలబడవు.. విడాకులు తీసుకోవడం అనేది సినిమాలలో చాలా సహజమైన అంశం. అసలు బాలీవుడ్లో ఈ విడాకుల వ్యవహారాలు చాలా కామన్ అని అక్కడి ప్రేక్షకుల ముందుకు భావిస్తోంది.

ఎందుకు విసిగి వేసారిపోయారు. భర్త లేదా భార్య నచ్చకపోతే విడిపోవడమే మంచిది అని అనుకున్నప్పుడు ఈ ప్రపంచంలో వివాహ వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోతుందేమో అనిపిస్తుంది. ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తన రెండో భార్య కు విడాకులు ఇస్తున్నాడు అనే వార్త మళ్లీ బాలీవుడ్లో ప్రముఖ దాంపత్య జీవితం పై దృష్టి మళ్లేలా చేసింది. బాలీవుడ్లో కోట్ల రుణాలు ఇచ్చి మరీ భార్యకు విడాకులు ఇచ్చి చాలామంది ఉన్నారు. ముందుగా చెప్పుకోవాల్సింది హృతిక్ రోషన్ గురించే. 

సుసాన్ ఖాన్ ను పెళ్లి చేసుకున్న తర్వాత పదేళ్ల పాటు జీవితం సాగింది. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అయితే మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో ఆమెకు 400 కోట్ల రూపాయల భరణం ఇచ్చి మరీ విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత సైఫ్అలీఖాన్ నష్టపరిహారం చెల్లించి విడాకులు ఇచ్చాడట. సంజయ్ దత్ రియా పిళ్ళై అభిప్రాయ భేదాల కారణంగా విడిపోయి భారీ నష్టపరిహారం చెల్లించాడు. దీంతో ఇన్ని కోట్లు ఇచ్చి మరి భార్యలను వదిలేసుకున్న ఈ హీరోల ను ఆదర్శంగా తీసుకుంటే అభిమానులు ఇంకెలా చేయాలని అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొంతమంది సమాజ విశ్లేషకులు. మరి ఈ రకమైన సంప్రదాయాన్ని ఆపాలంటే వివాహ వ్యవస్థ మరింత బలపడాల్సిన అవసరం ఉంది 

మరింత సమాచారం తెలుసుకోండి: