మెగా  పవర్ స్టార్ రామ్ చరణ్ 15వ చిత్రాన్ని దేశం గర్వించదగ్గ దర్శకుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి జేమ్స్ కామెరూన్ గా పేరు సంపాదించిన శంకర్ తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాని శ్రీవెకంటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో నిర్మిస్తున్నాడు.ఇలా శంకర్-రామ్ చరణ్- దిల్ రాజ్ కాంబో మూవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతుంది. అయితే అంతకు ముందే శంకర్ తో దిల్ రాజు ఇండియన్ -2 చిత్ర నిర్మాణంలో భాగమయ్యాడు. కానీ అనూహ్యంగా ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం జరిగింది. ఇక ఆ తరువాతే మళ్లీ చరణ్ -శంకర్ కాంబినేషన్ లో దిల్ రాజు సోలో నిర్మాతగా బరిలో దిగారు. దిల్ రాజు సాహసం నిజంగా ప్రశంసించదగినది.

సాధారణంగా ఒక సినిమా నుంచి తప్పుకుని మళ్లీ అదే దర్శకుడితో సినిమా చెయ్యడం అంటే.. అదీ శంకర్ లాంటి దిగ్గజ దర్శకుడితో సినిమా అంటే అంత సులుభమేమీ కాదు. కానీ దిల్ రాజు గారు తెలివితేటలతో దాన్ని సెట్ చేసారు. మరి ఇదెలా సాధ్యమైందో తెలుసా..ఈ ముగ్గురి కాంబో సెట్ కావడానికి ఎన్. నరసింహరావు అనే వ్యక్తి కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఈ నరసింహరావు ఎవరంటే శంకర్ వద్ద పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్. శంకర్ తో ఆయనకి కొన్నేళ్లగా స్నేహం ఉందట. ఆ కారణంగానే దిల్ రాజు ని శంకర్ తో కలిపి రామ్ చరణ్ తో ప్రాజెక్ట్ సెట్ చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.ఇక ఈ ప్రాజెక్ట్ ఓకే అవ్వగానే మెగా అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది.ఖచ్చితంగా ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులని బద్దలు కొడుతుందని మెగా అభిమానులు భావిస్తున్నారు. ఈ కాంబో కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. మరి శంకర్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: