
ఎంతో చూడచక్కని రూపం, ఆరడుగుల ఎత్తు ఉండే మహేష్ బాబు మనసు కూడా ఎంతో అందంగా ఉంటుంది అని చెప్పడానికి ఆయన చేస్తున్న అనేక సామజిక కార్యక్రమాలతో పాటు ఇతరులకు సినిమా ప్రముఖులకు ఆయన ఇచ్చే గౌరవాన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు. సెట్ లో చిన్న పెద్ద అని తేడాలేకుండా లైట్ బాయ్ దగ్గరి నుండి డైరెక్టర్ వరకు అందరినీ ఎంతో సాదరంగా పలకరిస్తూ సరదాగా సెట్స్ లో గడిపే మహేష్, తనతో వర్క్ చేసే వారితో కూడా మరింత చనువుగా ఉంటారు.
ఇక అసలు విషయం ఏమిటంటే తన కెరీర్ బిగినింగ్ నుండి వరుసగా తన సినిమాలకు పర్సనల్ మేకప్ మ్యాన్ గా వ్యవహరిస్తూ తన ఇంట్లో మనిషిగా మారిన పట్టాభి నేడు జన్మదినం జరుపుకుంటుండడంతో సూపర్ స్టార్ మహేష్ ప్రత్యేకంగా ఆయనకు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా విషెస్ తెలియచేసారు. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి, మీ పట్ల ప్రేమానురాగాలు, గౌరవం ఎప్పటికీ నిలిచి ఉంటాయి అంటూ మహేష్ పోస్ట్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం గల మహేష్, ఈ విధంగా ప్రతిఒక్కరిని గౌరవిస్తూ ఉండడం వల్లనే హీరోగా ఆయనకు మరింత మంచి పేరు లభిస్తోంది అని అంటున్నారు సినీ విశ్లేషకులు .... !!