
దర్శక ధీరుడు రాజమౌళి టాలీవుడ్ లోనే అపజయం ఎరుగని దర్శకుడు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి నిన్నటి బాహుబలి సినిమా వరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించి టాలీవుడ్ లో నెంబర్ వన్ డైరెక్టర్ గా అవతరించాడు. ప్రస్తుతం దేశంలోని భారీ మల్టీస్టారర్ ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కిస్తున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ సినిమా కోసం దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది.
ఇక సినిమా ఇండస్ట్రీలో అందరికీ ఉన్నట్లుగానే రాజమౌళికి కూడా ఓ సెంటిమెంటు ఉంది. అదేంటంటే తన దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో చాలా సినిమాలు జూలై నెలలో విడుదలై సంచలన విజయాలు సాధించాయి. అందులో మూడు సినిమాలు ఇండస్ట్రీ హిట్ కొట్టాయి. ఎన్టీఆర్ తో చేసిన సింహాద్రి, రామ్ చరణ్ తో చేసిన మగధీర, మర్యాద రామన్న,, ఈగ, బాహుబలి వంటి సినిమాలు ఈ నెలలోనే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. 2003 జూలై 9న సింహాద్రి సినిమా విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది సింహాద్రి సినిమా. ఎన్టీఆర్ ను స్టార్ హీరోగా చేసిన సినిమా ఇది. రామ్ చరణ్ తో చేసిన మగధీర సినిమా కూడా 2009 జూలై 31న విడుదలై అద్భుతమైన జనాదరణ పొందింది. ఈ సినిమా టాలీవుడ్ లో ఎన్నో రికార్డులు సృష్టించి ఇండస్ట్రీ హిట్ గా మిగిలింది.
ఇక రాజమౌళి చేసిన ఈగ సినిమా టెక్నికల్ గా ఎంత మంచి పేరు తీసుకువచ్చిందో అందరికీ తెలిసిందే. నాని సుదీప్ ప్రధాన పాత్రలో చేసిన ఈ సినిమా దేశవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు రాజమౌళి. సునీల్ హీరోగా తీసిన మర్యాద రామన్న సినిమా కూడా 2010 జూలై 23న విడుదల కనీవినీ ఎరుగని రీతిలో విజయాన్ని అందుకుంది. సునీల్ కు ఎంతో ప్లస్ అయిన సినిమా ఇది. 2012 జూలై 6న విడుదలైన ఈ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. ఇక బాహుబలి సినిమా సృష్టించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2015లో జూలై 10న విడుదలైన ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలన హిట్ అయ్యింది. ఇలా ఐదు సినిమాలు జూలై నెలలో విడుదల చేసి రాజమౌళి ఇండస్ట్రీకి మరపురాని సినిమాలను అందించాడు.