రవితేజ హీరోగా ఇటీవలే ఆయన తన 68వ సినిమాను శరత్ శరత్ మండవ దర్శకత్వంలో ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి రామారావు ఆన్ డ్యూటీ అనే టైటిల్ ను ఖరారు చేశారు.  ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. ఈ సినిమాలో రవితేజ నిజాయితీగల గవర్నమెంట్ ఆఫీసర్ గా కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ సినిమా అనౌన్స్ కాగానే ప్రతి ఒక్కరు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న శరత్ మండవ ఎవరు అని ఆరా తీశారు. రవితేజ ను ఒప్పించిన ఈ దర్శకుడు ఎవరు అని తెలుసుకోవాలని కుతూహలంగా ఆయన గురించి వెతికారు.

ఇంతకీ శరత్ మండవ తమిళంలో దర్శకుడిగా అందరికీ పరిచయమైన వ్యక్తి. దర్శకుడిగా కో2 అనే సినిమాను తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నాడు. సినిమాటోగ్రాఫర్ గా కూడా కొన్ని సినిమాలకు పని చేశాడు శరత్ మండవ. ఆర్పి పట్నాయక్ నటించి దర్శకత్వం వహించిన బ్రోకర్ తులసీదళం వంటి చిత్రాలకు కెమెరామెన్ గా పనిచేశాడు. ఇక రచయితగా అజిత్ నటించిన బిల్లా 2, డేవిడ్ బిల్లా వంటి చిత్రాలకు పనిచేశాడు. అంతేకాకుండా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా కూడా కొన్ని సినిమాలు చేశాడు. 

ఆయనకు ఇంత మంచి ట్రాక్ రికార్డు ఉంది కాబట్టే రవితేజ ఆయనకు అవకాశం ఇచ్చారని చెబుతున్నారు. ఇకపోతే ఇటీవలే క్రాక్ సినిమాతో హిట్ సాధించిన రవితేజ అదే ఊపు లో రమేష్ వర్మ దర్శకత్వంలో కిలాడి సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా హిందీ హక్కులను రిలీజ్ కాకముందే హిందీలో అమ్మడంతో ఆ సినిమా హిట్ అవుతుందని ముందుగానే అంచనా వేసుకోవచ్చు. రవితేజ ఒప్పుకునే సినిమాల వరస చూస్తుంటే ఆయనలో చాలా పరిణతి కనిపిస్తుంది అని తెలుస్తుంది. మరి రవితేజకు ఈ సినిమాలు ఏ రేంజ్ లో హిట్ ను అందిస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: