టాలీవుడ్ లో అతి తక్కువ కెరియర్ స్పాన్ టైం ఉన్న హీరోయిన్ లు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి. లేదంటే ఆ తర్వాత వారికి సినిమా అవకాశాలు రావు. క్రేజ్ కూడా తగ్గిపోవడంతో పాటు వారికి అవకాశాలు సన్నగిల్లుతాయి. ఈ తరం హీరోయిన్లు ఈ విషయం ముందుగానే తెలుసుకొని చేసినన్ని రోజులు సినిమాలు చేసి భారీ పారితోషికాలు అందుకుని ఆ తర్వాత తమ జీవితంలో సెటిల్ అయిపోతున్నారు. ప్రస్తుతం ఈ జనరేషన్ లో టాప్ హీరోయిన్ లు గా ఓ వెలుగు వెలిగారు ఇద్దరు కథానాయికలు.

కొన్ని నెలల్లో అటు ఇటు తారతమ్యం తో వారిద్దరూ పెళ్లిళ్లు కూడా తీసుకున్నారు. దాంతో వారికి సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. వారే కాజల్ అగర్వాల్, సమంత. కాజల్ అగర్వాల్ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ ను పెళ్లి చేసుకోగా సమంత అక్కినేని వారసుడు నాగచైతన్య ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరి కెరీర్ ను గనుక గమనిస్తే పెళ్లికి ముందు స్టార్ హీరోల సినిమాలు నాలుగైదు వారి చేతిలో ఉండేవి. పెళ్లి తర్వాత సీన్ రివర్స్ అయ్యింది. వారి చేతిలో ప్రస్తుతం కొన్ని సినిమాలు ఉన్నప్పటికీ అవి నార్మల్ సినిమాలే కావడం గమనార్హం. 

గతంలో ఒప్పుకున్న స్టార్ హీరోల సినిమాలను ఇప్పుడు పూర్తి చేస్తున్నారు వీరు. కొత్తగా వచ్చే సినిమా అవకాశాలు ఏవి కూడా స్టార్ హీరోల సినిమాలు లేకపోవడంతో వీరిద్దరి కెరీర్ టాలీవుడ్ కు సంబంధించి అయిపోయిందని అనుకుంటున్నారు ప్రేక్షకులు. కాజల్ అగర్వాల్ కు చిరంజీవి, నాగార్జున వంటి సీనియర్ హీరోల సరసన నటించేందుకు సినిమాలు వస్తున్నాయి. సమంత వెబ్ సిరీస్ లు తప్ప సినిమాలేవీ చేయట్లేదు. ఈ నేపథ్యంలో వీరిద్దరికీ స్టార్ హీరోలు అవకాశాలు ఇవ్వడం జరగదు. దాంతో వీరి అభిమానులు ఇక వీరికి సినిమా అవకాశాలు రావడం కల అని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వారు తిరిగి కమ్ బ్యాక్ చేస్తారో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: