
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తో టాలీవుడ్ కి పరిచయం అయిన హీరోయిన్ గజాల. ఆ తర్వాత ఎన్నో సూపర్ హట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగిం ది. అ తి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయిన గజాల తమిళ కన్నడ భాషలలో కూడా చిత్రాలు చేసి మంచి పేరు ప్రఖ్యాతలు దక్కించుకుంది. తన అందచందాలతో హావభావాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించి కోట్లాది మం ది అభిమానా న్ని చూరగొం ది. 

కలుసుకోవాలని, అల్లరిరాముడు, తొట్టిగ్యాంగ్ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత ఆమెకు అవకాశాలు తగ్గిపోవడంతో మెల్లమెల్లగా టాలీవుడ్ నుంచి కనుమరుగైపోయింది. తర్వాత మనీ మనీ మోర్ మనీ అనే సినిమా చేసి 2011లో సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. అలా ఇండస్ట్రీలోకి వచ్చి అతి తక్కువ కాలంలోనే హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఆ తర్వాత ప్రేక్షకులకు దూరమైన హీరోయిన్ లలో ఒకరిగా మిగిలిపోయారు. . ఇక రంగుల ప్రపంచం సృష్టించిన పరిస్థితుల్లో పడి ఆమె మరణం అంచుల వరకు వెళ్లి వచ్చిన విషయం అందరికి తెలిసిందే.
ఎంత వేగంగా ఫేమస్ అయ్యిందో అంతే వేగంగా కనుమరుగైపోయిన ఈమె ఒకానొక దశలో ఒక యువ హీరో ప్రేమలో పడి అతను మోసం చేశాడంటూ ఆత్మహత్య చేసుకోవడానికి సైతం ప్రయత్నించింది. అదృష్టవశాత్తు ఆ గండం నుంచి బయట పడగలిగిన గజలా లవ్ ఫెయిల్యూర్ నుంచి బయటపడలేక సినిమాలను చేయలేకపోయింది. ఇక సినిమాలకు పూర్తిగా దూరమైన గజాల టీవీ నటుడు ఫైజల్ రాజా ఖాన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2016లో జరిగిన వీరి పెళ్లి తర్వాత సినిమాలకు స్వస్తి చెప్పింది. తన భర్త దర్శకత్వంలో సీరియల్స్ లో నటించబోతుంది ఈ ముద్దుగుమ్మ.