టాలీవుడ్ లో యాంకర్ గా సెటిలైపోయింది శ్రీముఖి.  తొలుత నటిగా కొన్ని సినిమాల్లో నటించి ఆ తర్వాత యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించి యాంకర్ గా సెటిల్ అయిపోయింది. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సామెతను మన హీరోయిన్ లు ఏ విధంగా అయితే పాటిస్తారో శ్రీముఖి కూడా దాన్ని వందకు వందశాతం పాటిస్తూ ఫేమ్ లో ఉన్నప్పుడే నాలుగురాళ్లు వెనక్కి వేసుకోవాలి అని
 ఆమె సంపాదన కోసం అన్ని మార్గాలను వాడేస్తూ శభాష్ శ్రీముఖి అనిపించుకుంటుంది. 

ఓవైపు యాంకరింగ్ మరోవైపు నటనతో రెండు చేతులా సంపాదిస్తున్న శ్రీముఖి కి తన ఫేమ్ ఉపయోగించుకుని ఇప్పటికే బ్యాంకు బ్యాలెన్స్ ను బాగానే మెయింటైన్ చేస్తుంది. కార్లు ఇల్లు బంగ్లాలు అన్నీ సంపాదించుకుంది. స్టార్ యాంకర్ అయిపోయిన శ్రీముఖి హీరోయిన్ గా కూడా చేస్తుందేమో చూడాలి. అయితే శ్రీముఖి తనకు ఆదాయాన్ని తెచ్చిపెట్టే మార్గాన్ని కూడా వదిలిపెట్టడం లేదు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని రకాల సంస్థల ఉత్పత్తులు సేవలను ప్రమోట్ చేస్తూ చేతినిండా సంపాదిస్తూ ఉండగా హోటల్స్ రిసార్ట్స్ వెకేషన్ కి సంబంధించిన వీడియోలు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయడం ద్వారా సదరు సంస్థ నుండి మంచి రెమ్యునరేషన్ అందుకుంటున్నారు శ్రీముఖి. 

వీడియోలలో ట్రేడింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ మరి కొంత ఆదాయం గడిస్తున్నారు శ్రీముఖి.  ఆ వీడియోస్ కి వ్యూస్ యూట్యూబ్ నుండి వచ్చే ఆదాయం అదనం కాగా తన ఇంస్టాగ్రామ్ లో కూడా శ్రీముఖి  కొన్ని ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా జియో మార్కెట్ ని ప్రమోట్ చేస్తూ వీడియో చేసిన ఆమె ఆ వీడియోను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి తమకు కావలసిన గ్రసరి ఇక్కడ కొనడం ఎంతో లాభదాయకమని తెలియజేశారు. అలా టీవీ షోలు, సినిమాలు, సోషల్ మీడియా ప్రమోషన్ ద్వారా శ్రీముఖి బాగానే డబ్బు సంపాదిస్తుంది. మరి భవిష్యత్తులో ఇంకెన్ని మార్గాలను అన్వేషిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: