సినిమాల్లో రాణించడం అనేది ప్రతి ఒక్క
సినిమా నటుడి కల. ఎంతోమంది నటీనటులు తమ కలను నెరవేర్చుకుని ఇప్పుడు స్టార్ నటులుగా ఎదిగారు. స్వయంకృషితో వచ్చి స్టార్ గా ఎదిగిన వారు
టాలీవుడ్ పరిశ్రమలో చాలా మంది ఉండగా వారిలో
మెగాస్టార్ చిరంజీవి ఎంతో కష్టపడి ఇప్పుడు నెంబర్ వన్ స్థాయికి ఎదిగారు. ఇక
ఈ రోజుల్లో నటుడు అవ్వడం పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే సోషల్ మీడియాలో తమ టాలెంట్ ను నిరూపించుకో ని ఎంతో మంది నటులు అయ్యారు.
ఆ తరువాత అక్కడ వచ్చిన ఫేమ్ తో సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుని నటులు అవుతున్నారు. ముఖ్యంగా
టాలీవుడ్ లో
కమెడియన్ లకు నటించడానికి ఇబ్బంది ఏం లేదు.
జబర్దస్త్ ఎప్పుడైతే వచ్చిందో
టాలీవుడ్ కి ఎంతో మంది
కమెడియన్ లు దొరికారు. తనదైన కామెడీతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న వీరు ఒక్కొక్కరు ఒక్కో నేపథ్యం నుండి వచ్చి ఇప్పుడు స్టార్ గా ఎదిగారు. ఆ విధంగా గా
టాలీవుడ్ లో ఎప్పటి నుంచో అవకాశాల కోసం చూసి
జబర్దస్త్ తో బ్రేక్ తెచ్చుకున్నాడు రైజింగ్ రాజు. హైపర్
ఆది టీం లో సహాయ నాయకుడిగా ఉన్న రైజింగ్ రాజు తన కామెడీతో ప్రేక్షకులను ఎంతగానో ప్రేక్షకులను మెప్పించాడు.
42 ఏళ్ల క్రితం
సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు రైజింగ్ రాజు.
మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడైతే తన
సినిమా కెరీర్ ను ప్రారంభించారో సరిగ్గా అప్పుడే రైజింగ్ రాజు తన కెరియర్ ను కూడా మొదలుపెట్టారు. మొదట్లో
సినిమా ఇండస్ట్రీలో ఆఫీస్ బాయ్ గా చేసిన రాజు 1981లో మరోమలుపు అనే సినిమాతో ఆరంగేట్రం చేశారు. ఆ తర్వాత
చిన్నా చితకా సినిమాల్లో నటించారు. వాటివల్ల గుర్తింపు లేకపోవడంతో
సినిమా అవకాశాలు కూడా దూరమయ్యాయి. ఆ తర్వాత ఎన్నో కష్టాలను ఎదుర్కొని
జబర్దస్త్ లో మళ్లీ మంచి రోజులను చూస్తున్నాను అని ఆయన వెల్లడించారు. నిజంగా
జబర్దస్త్ ఎంతోమందికి పేరును ఇవ్వటమే కాదు ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు.