ప్రియమణి.. ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎక్కడ చూసినా ఈ అమ్మడి పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ల రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుంటూ దూసుకుపోతుంది. ఒకప్పుడు హీరోయిన్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో తన హవా నడిపించింది ప్రియమణి. ఎన్నో గ్లామర్ పాత్రల్లో నటించి తన నటనతో తన అందంతో కూడా తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది.  ఇక కొన్నాళ్లపాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగింది.  ఇక ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో తెలుగు వెండితెరపై కనుమరుగయ్యింది ప్రియమణి. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. కానీ రీ ఎంట్రీ మాత్రం ఎంతో గ్రాండ్గా ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.



 ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రియమణి ఎంచుకున్న పాత్రలు ఒకప్పుడు హీరోయిన్గా వచ్చిన క్రేజ్ కంటే ఎక్కువ గుర్తింపు తెచ్చి పెడుతున్నాయి. వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్గా ప్రస్తుతం ప్రియమణి మారిపోయింది. ఇప్పటికే సాయి పల్లవి రానా ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా విరాట పర్వంలో కామ్రేడ్ భారతక్క గా నటించింది ప్రియమణి.  ఈ క్రమంలోనే ప్రియమణి పాత్ర పై ఎన్నో అంచనాలు పెరిగిపోయాయ్. ఇక అదే సమయంలో ఇటీవలే సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ది ఫ్యామిలీ మాన్ 2 వెబ్ సిరీస్ లో డి గ్లామర్ పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించింది.



 ఇక ఇప్పుడు  వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న నారప్ప సినిమా లో కూడా మరో కీలక పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇటీవలే నారప్ప సినిమాకు సంబంధించి ట్రైలర్ విడుదల కావడంతో ఇక ప్రియమణి పేరు తెలుగు చిత్ర పరిశ్రమలో మార్మోగిపోతోంది. ఒక డిఫరెంట్ గెటప్ లో ప్రియమని  నారప్ప సినిమా లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.  అయితే నారప్ప సినిమాకు ముందు తన కెరీర్ లో ఒక్కసారైనా వెంకటేష్ తో నటించాలనే కోరిక ఉండేది అంటూ చెప్పుకొచ్చింది. అయితే నారప్ప సినిమాతో ఆ కోరిక తీరింది అంటూ తెలిపింది. ఇక ఒక్క కోరిక మిగిలిపోయింది అంటూ ప్రియమణి చెప్పుకొచ్చింది. మెగాస్టార్ తో ఒక సినిమాలో నటిస్తే ఇక తన కోరిక తీరిపోతుంది అంటూ ఇటీవలే ఒక మీడియా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: