ఎప్పటి నుంచో సినిమాలలో చూపించే కొన్ని సన్నివేశాల ద్వారా డైలాగుల ద్వారా కొంతమంది మనోభావాలు దెబ్బ తినడం మనం చూస్తూ ఉన్నాం. తమ కు చెందిన దేనినైనా కించపరిచినట్టు సినిమా లో చూపిస్తే వారి మనోభావాలు ఎక్కువగా దెబ్బతింటాయి. ఎలాంటి విషయాన్ని అయినా తమ వర్గాలకు ఆపాదించుకుని మనోభావాలు దెబ్బతిన్నాయని చెబుతూ వారి ఉనికిని చాటుకోవడం కోసం చట్టవ్యతిరేకమైన తెలిసిన కూడా కొందరు సినిమాలపై, సినిమా వారిపై విరుచుకుపడుతూ ఉంటారు.  

భావ స్వాతంత్రాన్ని అనుసరించి తీసిన సినిమాల్లో తెలుసో తెలియకో కొన్ని మతాలకు కులాలకు వర్గాలకు సంబంధించిన ప్రస్తావన వచ్చే సన్నివేశాలలో సంభాషణలలో వారిని ఏదో చిన్న మాట అని ఉండొచ్చు. వాటిని సాధ్యమైనంత వరకు సెన్సార్ బోర్డు హెచ్చరించి లేకుండా చేస్తుంది కానీ ఒక్కోసారి పరిస్థితి చేయి దాటి పోతాయి. అలా దేశంలో సినిమాల వల్ల ఎన్నో అల్లర్లు జరిగాయి. పద్మావతి సినిమా విషయంలో నార్త్ ఇండియాలో పెద్ద గొడవే జరిగింది. సినిమా హాల్స్ మీద దాడులు దాకా వెళ్ళింది వ్యవహారం. హైందవ రాణి అయిన పద్మావతిని ముస్లిం అక్రమ దారుడు అల్లా ఉద్దీన్ ఖిల్జీ కామవాంఛతో వశ పరుచుకునే ప్రయత్నం చేస్తాడు.  ఈ కథ ఒక వర్గానికి మింగుడుపడలేదు. దాంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని థియేటర్లను టార్గెట్ చేశారు. 

ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన తాండవం అనే వెబ్ సిరీస్ వల్ల మత ఘర్షణలు చెలరేగే వివాదం నెలకొంది. ఓ దళిత నాయకుడు అగ్రకులానికి చెందిన స్త్రీ తో అక్రమ సంబంధం పెట్టుకొని మోసం చేసిన సన్నివేశంలో ఆ స్త్రీ చెప్పిన ఒక డైలాగ్ దళితుల మనోభావాలు దెబ్బ తీసింది. అదే సిరీస్ లో హిందూ దేవుళ్ళ పై అనవసర సన్నివేశాలు ఉన్నాయని హిందువుల మనోభావాలు కూడా దెబ్బ తిన్నాయి. ఈ విషయం కోర్టు దాకా వెళ్ళింది. ఆ తర్వాత ఇటీవలే విడుదలైన ఫ్యామిలీ సిరీస్ లో ఎల్టిటి ఉగ్రవాది పాత్ర సమంత చేస్తుందని తమిళ మనోభావాలు దెబ్బతిన్నాయి. రిలీజ్ ఆపాలని ప్రభుత్వం కూడా ఒత్తిడి చేసే ప్రయత్నం చేయగా చివరికి ఈ సిరీస్ విడుదలై సూపర్ హిట్ సాధించింది. తాజాగా తుఫాను సినిమా విడుదల అయింది అమెజాన్ లో.  ఇందులో హీరో పాత్ర పాత్రధారి ముస్లిం హీరోయిన్ పాత్ర పాత్రధారి హిందూ. లవ్ జిహాద్ పై వ్యతిరేక గళం వినిపించే హీరోయిన్ తండ్రి ఒక మతం పై తన అభిప్రాయం చెబుతూ కొన్ని విమర్శలు చేస్తాడు. చాలా బ్యాలెన్స్ తో ఈ కథ నడిపారు. లేదంటే పెద్ద ప్రమాదం ముంచుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: