
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ఏకే రీమేక్. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పన్ కోషియమ్ అనే సినిమాను తెలుగులో పవన్ హీరోగా తెరకెక్కుతుండగా ఇందులో రానా కూడా మరో కథానాయకుడిగా నటిస్తున్నాడు. నిత్యామీనన్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఇది హైలెట్ గా పోతుంది అన అంటున్నారు. ఇక అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న సాగర్ కే చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
తొలిసారి ఓ స్టార్ హీరోని డైరెక్ట్ చేస్తున్న సాగర్ కే చంద్ర ఈ చిత్రాన్ని సవాలుగా తీసుకుని తెరకెక్కిస్తున్నాడు. త్రివిక్రమ్ మాటలు ఈ సినిమాకు తోడై హిట్ అవడానికి దూసుకుపోతుంది. ఇకపోతే కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల కెమెరామెన్ ప్రసాద్ మూరెళ్ల ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు అని తెలుస్తోంది.కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఈ చిత్రీకరణ మొదలు కాగా కెమెరామెన్ కి దర్శకుడికి పడకపోవడంతో కెమెరామెన్ ప్రసాద్ మూరెళ్ళ తప్పుకున్నారు. ఇప్పుడు రవి కే చంద్రన్ ఆ బాధ్యతలు నిర్వహించబోతున్నారు.
ప్రసాద్ మూరెళ్ల తీసిన సన్నివేశాలు కొన్ని పక్కనపెట్టి వాటిని మళ్ళీ కొత్తగా చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ప్రసాద్ సినిమాటోగ్రఫీ నచ్చకనే ఆయన పక్కన పెట్టారు మరి అలాంటప్పుడు ఆయన తీసిన సన్నివేశాలు ఉంచుకోవడానికి ఇష్టపడని దర్శకుడు దాన్ని మళ్లీ రీషూట్ చేస్తున్నారని చెబుతున్నారు. కొన్ని సన్నివేశాలు చూసిన తర్వాత కథ టెంపో మార్చేశారని ప్రసాద్ మూరెళ్ల పై దర్శకుడు మండిపడ్డారు. దాంతో ఈ సినిమా రీ షూట్ చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సినిమాకి మొదలైన ఈ కొత్త వివాదం దేనికి దారి తీస్తుందో చూడాలి. ఇకపోతే పవన్కళ్యాణ్ ఈ సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ మాస్ మసాలా చిత్రం లైన్ లో ఉన్నాయి.