ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సన్సేషనల్ హీరోగా ఎదిగిన నవీన్ పొలిశెట్టి ప్రస్తుతం తన తదుపరి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఇప్పటికే ఆయన చాలా సినిమాలను ఎటువంటి మొహమాటం లేకుండా రిజెక్ట్ చేశారు. మంచి కథాబలం ఉన్న సినిమాలను మాత్రమే ఆయన చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే జాతిరత్నాలు బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత దానికి సీక్వెల్ గా మరో సినిమా చేసేందుకు మూవీ యూనిట్ సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి అమెరికా కి వెళ్లి ఇబ్బందులు పడతారట. అయితే అమెరికాలో వారి పడే ఇబ్బందుల నుంచి బీభత్సమైన కామెడీ పుట్టించడానికి దర్శకుడు అనుదీప్ కె.వి మంచి స్క్రిప్టు రెడీ చేసుకున్నారని సమాచారం. స్క్రిప్ట్ వినగానే నవీన్ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.
జాతిరత్నాలు పార్టు 1లో నవీన్ పొలిశెట్టి హైదరాబాద్ వెళ్లి ఒక పెద్ద సమస్యలో చిక్కుకుంటారు. అంతేకాకుండా హైదరాబాద్ లో చిట్టి (ఫారియా అబ్దుల్లా) ని చూసి ఆమెపై మనసు పారేసుకుంటారు. తర్వాత తన తెలివిని ఉపయోగించి ఎలాగోలా చిట్టి మనసును దోచేస్తారు. మరి దానికి కొనసాగింపుగా రాబోతున్న జాతిరత్నాలు 2లో ఏ భామ పై మనసు పారేసుకుంటారో చూడాలి. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐతే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో.. సినిమా ఎప్పుడు పూర్తవుతుందో అధికారికంగా తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
ఇదిలా ఉండగా.. హీరోగా 100% సక్సెస్ రేటుతో దూసుకెళ్తున్న నవీన్ తనకున్న డిమాండ్ ను బట్టి పారితోషికాన్ని విపరీతంగా పెంచేస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. జాతి రత్నాలు సీక్వెల్ కోసం ఆయన అక్షరాలా మూడుకోట్ల రూపాయలు తీసుకుంటున్నారట. ఒక యువ హీరో ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకోవడం నిజంగా ఆశ్చర్యపడాల్సిన విషయమే. అయితే ఫస్ట్ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో.. రెండో సినిమాపై సహజంగానే విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దీంతో ఆ క్రేజ్ ను బట్టి, తనకున్న డిమాండ్ ని బట్టి నవీన్ పొలిశెట్టి తన పారితోషికం పెంచారని తెలుస్తోంది. ఈ చిత్రానికి నిర్మాత అయిన స్వప్న దత్( నాగ్ అశ్విన్ బంధువు) రూ. 3కోట్ల రూపాయలు ఇచ్చేందుకు అంగీకరించారట. కాగా ఈ సినిమా షూటింగ్ ని స్వప్న ఫిలింస్ బ్యానర్ పై వచ్చే ఏడాది ప్రారంభించనున్నారని సమాచారం.