
మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన క్రాక్ చిత్రం సూపర్ హిట్ కావడంతో ఆయన వరుస సినిమాలు ఒప్పుకుంటూ బిజీ గా మారుతున్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న ఖిలాడి సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా కావడంతో సినిమా పై మంచి అంచనాలున్నాయి. వీరి కాంబినేషన్ లో మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ ను మిగల్చడం తో ఈ చిత్రంతో హిట్ కొట్టాలని భావిస్తున్నారు వీరిద్దరూ.
దర్శకుడు రవి వర్మ కూడా ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే ఈ చిత్రం ఇంకా షూటింగ్ దశలో ఉండగానే బాలీవుడ్ లో ఈ చిత్రానికి సంబంధించిన రైట్స్ ను కూడా కొనడం విశేషం. ఈ సినిమా ప్రస్తుతం వివాదంలో ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. దానికి కారణం ఈ సినిమా దర్శకుడే కారణమని వెల్లడవుతుంది. రవితేజ లాంటి స్టార్ హీరో నీ, బిజీగా ఉన్న హీరోని డైరెక్ట్ చేయడం అంటే అంత మామూలు విషయం కాదు. ఎంతో కష్టపడితే కానీ ఆయనతో సినిమా అవకాశం రాదు.
అలాంటిది రమేష్ వర్మ మీద ఉన్న గౌరవంతో రవితేజ ఛాన్స్ ఇస్తే దర్శకుడు రవితేజ డేట్స్ ను సరిగ్గా ఉపయోగించకుండా మిస్ యూజ్ చేశాడట. దాంట్లో రవితేజ ఈ సినిమా కు అదనంగా కొన్ని రోజులు డేట్స్ ఇవ్వాల్సి వచ్చింది. ప్రస్తుతం మరో సినిమా చేస్తున్న రవితేజకు అది సాధ్యం కావట్లేదు. కిలాడి సినిమాకు సంబంధించిన షూట్ పూర్తయినందున రవితేజ వేరే సినిమాకి తన డేట్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఖిలాడి సినిమాకి కొన్ని రోజులు డేట్స్ అవసరం ఉందని చెప్పడంతో రవితేజ దర్శకుడిపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. రవితేజ శరత్ మండవ దర్శకత్వంలో రామారావు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రవితేజ ఈ సినిమాకు ఏ విధంగా డేట్స్ అడ్జస్ట్ చేస్తాడో చూడాలి.