ఎక్కడో చోట రీమేక్ సినిమా అనగానే ప్రేక్షకుల్లో ఒకలాంటి ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే వేరే భాషల్లో వచ్చిన సినిమా తెలుగులో చేయడం అంటే ఎవరికీ పెద్దగా నచ్చదు. అక్కడ సూపర్ హిట్ అయిన కూడా రీమేక్ సినిమా చూడడం పెద్దగా నచ్చదు ప్రేక్షకులకు.  అయినా కూడా హీరోలు తెలుగు వారికి మంచి సినిమా చూపించాలనే ఉద్దేశంతో రీమేక్ సినిమాలు చేసి విడుదల చేస్తూ ఉంటారు. వాటిలో కొన్ని సినిమాలు నచ్చుతాయి. ఎక్కువ సినిమాలు నచ్చవు. ఆ సినిమాలు ఎంతో బాగున్నప్పటికీ అప్పటికే మాతృకలో చూసినది కావడం, క్రేజ్ లేకపోవడం వంటి కారణాల వల్ల రీమేక్ సినిమాలను చూడడానికి ఇష్టపడరు.  ఇటీవలే వచ్చిన రీమేక్ సినిమాలు   ప్రేక్షకులకు ఉండే అపోహలను మొత్తం తొలగించింది. 

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా బాలీవుడ్ లో పింక్ సినిమా ఆధారంగా తెరకెక్కి టాలీవుడ్ లో సూపర్ హిట్ ను అందుకుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ కాగా అంజలి, నివేద థామస్ కీలక పాత్రల్లో నటించి సినిమా హిట్ కు తోడ్పడ్డారు. రీమేక్ సినిమానే అయినా ఈ సినిమా తెలుగు నాట సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ప్రజల లో రీమేక్ సినిమాలపై ఉన్న అభిప్రాయాన్ని పూర్తిగా తొలగిచేసింది ఈ సినిమా. 

ఇటీవలే విడుదలైన నారప్ప సినిమా కూడా ప్రేక్షకులలో రీమేక్ సినిమాపై ఉన్న చిన్న చూపును తుడిచి పెట్టేసింది. మాతృక కు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కించి ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయిన ఈ సినిమా లో వెంకటేష్ నటనకు బ్రహ్మరథం పడుతున్నారు తెలుగు ప్రేక్షకులు. ఇప్పటివరకు రీమేక్ సినిమాలు అంటే ఎక్కువగా ఆసక్తి చూపని వారు సైతం ఈ రెండు సినిమాల ఫలితం, తీరు చూసి రీమేక్ సినిమాలు చూడాలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇవి మాత్రమే కాకుండా టాలీవుడ్ లో ఎన్నో రీమేక్ సినిమాలు తెలుగు ప్రేక్షకులు మెచ్చే విధంగా తెరకెక్కించారు. వాటిని చాలామంది మంచిగానే రిసీవ్ చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: