
అక్కినేని వంశంలో మూడో తరం హీరోగా ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు అక్కినేని నాగ చైతన్య. జోష్ సినిమాతో టాలీవుడ్ హీరోగా పరిచయమై ఆ తర్వాత ఏం మాయ చేశావే , మనం, మజిలీ వంటి సూపర్ హిట్ సినిమాలతో నటుడిగా టాలీవుడ్ లో సెటిల్ అయ్యాడు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంచాడు. తనదైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను సంపాదించుకుని క్రేజీ హీరోగా మారిపోయిన నాగచైతన్య అక్కినేని సమంత ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉన్న సమయంలోనే నాగచైతన్యతో పీకల్లోతు ప్రేమలో మునిగి పోయి ఆ తర్వాత పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు ఇద్దరూ. సోషల్ మీడియాలో తన భర్త కు సంబంధించిన విషయాలను వెల్లడిస్తూ అందరిలో ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. ఓవైపు సంసారాన్ని చూసుకుంటూనే మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తుంది. ప్రస్తుతం ఆమె వెబ్ సిరీస్ లలో కూడా నడుస్తుంది. ఇక నాగచైతన్య అక్కినేని నాగార్జున మొదటి భార్య కొడుకు అన్న విషయం అందరికి తెలిసిందే. అక్కినేని నాగార్జున రెండో భార్య అమల కుమారుడు.
ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంటున్న చై, సామ్ జంట తమ వైవాహిక జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. తన తండ్రి వారసత్వం నుంచి వందల కోట్ల ఆస్తిని నాగచైతన్య పొందాడని సమాచారం. అంతేకాకుండా సమంత సంపాదించిన 80 కోట్ల రూపాయల ఆస్తి పాస్తులు కూడా ఆయనకే చెందుతాయి. మరోవైపు ఆయన సినిమాల్లో నటించడం ద్వారా 40 కోట్ల దాకా ఇప్పటివరకు సంపాదించారట. అంతేకాకుండా తన తల్లి తరపు నుంచి కూడా ఆయనకు కొన్ని కోట్ల రూపాయలు రాబోతున్నాయి.మొత్తానికి నాగ చైతన్య కోట్ల రూపాయల ఆస్థి తనకు సంక్రమించింది అన్నమాట.