టాలీవుడ్ లో మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. బాహుబలి సినిమా తో ఒక్కసారిగా ఆయన పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు. ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన ప్రభాస్ ఆ తర్వాత వర్షం, ఛత్రపతి,బిల్లా, మిర్చి వంటి చిత్రాలతో స్టార్ హీరోగా ఎదిగి బాహుబలితో ఒక్కసారిగా దేశం మొత్తం మెచ్చుకునే హీరోగా ఎదిగాడు.  బాహుబలి సినిమా తర్వాత ఆయన తన ప్రతి సినిమాను దేశవ్యాప్తంగా విడుదల చేస్తూ భారీ అభిమానాన్ని పెంచుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన హీరోగా నాలుగు సినిమాలు సెట్స్ పైన ఉన్నాయి.

 Lవీటిలో సినిమా ముందుగా రాధాకృష్ణ దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కుతున్న రాధేశ్యామ్ విడుదల కానుంది.  ఆ తరువాత కే జి ఎఫ్ సినిమా ఒక్కసారిగా దేశాన్ని కుదిపేసిన దర్శకుడు ప్రశాంత్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నాడు. శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ మాఫియా లీడర్ కనువిందు చేయనున్నాడు.  బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఆదిపురుష్ తర్వాతి చిత్రంగా రాబోతుండగా ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్ గా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. చివరగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైంటిఫిక్ చిత్రాన్ని చేయనున్నాడు.

ప్రభాస్ మాత్రమే కాకుండా విదేశాలలో కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. కొన్ని విదేశీ మీడియా సంస్థలు హాలీవుడ్ స్టార్స్ గురించి మాత్రమే ఎక్కువగా కథనాలు రాస్తూ వస్తాయి. మన టాలీవుడ్ కి సంబంధించిన కథనాలు చాలా అరుదుగా మాత్రమే వస్తాయి. అయితే ఓ ఇటలీ మీడియా సంస్థ ప్రభాస్ గురించి ఓ కథనాన్ని రాయడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రభాస్ గ్లోబల్ స్టార్ కావడం వల్లే ఇది సాధ్యమైందని వారు భావిస్తున్నారు. రాధే శ్యామ్ సినిమా షూటింగ్ ఇటీవలే ఇటలో జరగగా దానికి సంబంధించిన కథనాన్ని ప్రచురించింది సదరు మీడియా సంస్థ. 

మరింత సమాచారం తెలుసుకోండి: