యువ హీరో శర్వానంద్, శ్రీకార్తిక్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ ఒకే ఒక జీవితం. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీగా వస్తున్న ఈ సినిమాలో శర్వానంద్ సరసన రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో శర్వానంద్ మదర్ రోల్ లో అక్కినేని అమల నటిస్తున్నారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తర్వాత అమల్ నటిస్తున్న సినిమా ఇదే అవడం విశేషం. ఇక ఈ సినిమా నుండి ఇటీవల వచ్చిన మోషన్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఇక సినిమా కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఒక లైన్ చెక్కర్లు కొడుతుంది.

శర్వానంద్ ఒకే ఒక జీవితం సినిమా టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో వస్తుందని తెలుస్తుంది. అయితే టైం ట్రావెల్ అనగానే దాఇతో గతంలోకి వెళ్లడం.. భవిష్యత్ లోకి తీసుకెళ్లడం లాంటివి చేస్తుంటారు. ఆ టైం లో వారి జీవన విధానాలు ఎలా ఉంటాయో చూపిస్తారు. అయితే శర్వానంద్ సినిమా మాత్రం అలా ఉండదని అంటున్నారు. సినిమా టైం మిషిన్ కాన్సెప్ట్ తో వస్తున్నా శర్వానంద్ అతని స్నేహితులు టైం ట్రావెల్ లో కేవలం తమ బాల్యం లోకి వెళ్లి అక్కడ తమ స్టూడెంట్ డేస్ గురించి తెలుసుకుంటారు. చిన్నప్పటి స్నేహాలు, ప్రేమలు లాంటివి తెలుసుకుంటారట.

చిన్నతనాన్ని యవ్వనాన్ని పక్క ఉండి చూస్తూ సినిమా కథ నడుస్తుందట. చెబుతుంటేనే ఇలా థ్రిల్లింగ్ గా ఉంటే ఇక సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఓ పక్క అజయ్ భూపతి డైరక్షన్ లో మహా సముద్రం సినిమా చేస్తున్న శర్వానంద్ ఒకే ఒక జీవితం కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇవే కాకుండా కిశోర్ తిరుమల డైరక్షన్ లో ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాను కూడా ఈమధ్యనే స్టార్ట్ చేశాడు. ఒకే ఒక జీవితం సినిమాను డ్రీం వారియర్ పిక్చర్స్ బ్యానర్ లో ఎస్.ఆర్ ప్రభు, ఎస్.ఆర్ ప్రకాష్ బాబు నిర్మిస్తున్నారు.  
 

మరింత సమాచారం తెలుసుకోండి: