దర్శకధీరుడు రాజమౌళి ఈ పేరు తెలియని వారు ఎవరు లేరు.తెలుగు చిత్ర పరిశ్రమను తక్కువ చేసి మాట్లాడుకునే హిందీ చిత్ర పరిశ్రమ వారు కూడా ప్రశంసించేలా చేసిన దర్శకుడు రాజమౌళి.  రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా అందరిని ఆశ్చరయ్య పరుస్తూ ఊహించని విధంగా భారీ విజయం అందుకుంది.
భారతీయ చిత్ర పరిశ్రమలో తన పేరు చిరస్థాయిలో నిలిచిపోయే విధంగా రాజమౌళి గుర్తింపు పొందాడు. అయితే రాజమౌళి తన సినీ ప్రస్థానంలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను తీశారు. అయితే రాజమౌళి దర్శకుడిగా పరిచయం అయిన సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నుంచి తన లేటెస్ట్ మూవీగా రాబోతున్న rrr సినిమా వరకు మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కరే. ఆయనే రాజమౌళి అన్న కీరవాణి గారు.అయితే ప్రతి ఇండస్ట్రీ లో దర్శకులు వారి చిత్ర కథకు సరిపడేవిధంగా మ్యూజిక్ ఉండాలని కోరుకుంటారు. దానికి తగ్గట్టుగా మంచి మ్యూజిక్ డైరెక్టర్ ను, ఆ సమయానికి ఫామ్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ను ఎంచుకుంటారు. కానీ రాజమౌళి తన మొదటి సినిమాకు ఎలాంటి మ్యూజిక్ అందించారో కీరవాణి తన  ప్రతి సినిమాను అదే ఉత్సాహంతో అందిందిస్తూనే ఉన్నాడు. అందుకే రాజమౌళి మరొక సంగీత దర్శకుడు గురించి ఆలోచించలేదు.

దాదాపుగా 20 సంవత్సరాలు వీరి ప్రయాణం కొనసాగుతూనే ఉంది. రాజమౌళి తీసే సినిమాలకు తన  టాలెంట్ అంత ఉపయోగించి సంగీతం అందిస్తాడు కీరవాణి. రాజమౌళి సినిమాలో సంగీత దర్శకుడిగా కీరవాణి పేరు తప్ప మరొకరి పేరు కనిపించలేదు. కీరవాణి సంగీత దర్శకుడుగా సుమారు 300చిత్రాలకు పైగా చేసాడు. కీరవాణి తనయుడు కాలభైరవ కూడా మంచి మ్యూజిక్ డైరెక్టర్ గా ఇప్పుడిప్పుడే పేరు పొందుతున్నాడు. తన తనయుడిని గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ చేసి తాను రిటైర్డ్ అవ్వాలనుకున్నట్లు తెలిపాడు. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాకు ముందే సినీ ప్రస్థానం నుంచి తప్పుకుందాం అని ఆలోచనలో ఉన్నాడట కీరవాణి కానీ రాజమౌళి వద్దనటంతో తాను విరమించుకున్నాడు. కానీ వయసు మీద పడటంతో మళ్ళీ పునరాలోచనలో పడ్డారట. ఆ మధ్య కీరవాణి తాను ఒక మానసిక వ్యాధితో భాధ పడుతున్నట్లు ప్రకటించాడు. తన ఆరోగ్య రీత్యా సినిమాల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది.

ఇదిలా ఉంటే rrr సినిమా తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ వంటి భాషలలో ఒకేసారి గా విడుదల కానుంది. అయితే పాన్ ఇండియన్ సినిమా కావడంతో అన్ని భాషలలో అలరించే మ్యూజిక్ అవసరం కానుంది.అందుకోసం హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం సినీ పరిశ్రమలో టాలెంటెడ్ సింగెర్స్ చేత ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్ పాడుటకు నియమించుకున్నార ట.తమిళ వర్షన్ ప్రమోషనల్ సాంగ్ కొరకు అనిరుద్ ని నియమించుకున్నట్లు సమాచారం. అనిరుద్ తమిళ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అందుకే అతనిని సంప్రదించినట్లు సమాచారం. మరి కీరవాణి రిటైర్డ్ అయితే రాజమౌళి ఎవరిని సంగీత దర్శకుడిగా నియమించుకుంటాడో మరి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: