పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా గీత గోవిందం. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. ఇక 2018లో టాలీవుడ్ కి లభించిన బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఈ సినిమా ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ఏకంగా 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిందంటేన్మే ఈ సినిమా ఎంత హిట్ అయ్యొందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాదు.. ఈ సినిమా విజయ్ - రష్మికలను స్టార్లుగా మార్చేసింది.

ఇక ఈ సినిమా నిర్మాత అల్లు అరవింద్ కు ట్రిపుల్ టైమ్ ప్రాఫిట్స్ వచ్చింది. అంతేకాదు.. దర్శకుడు పరశురామ్ కు సినీ జీవితానికి మంచి మలుపును తీసుకొచ్చింది. కాగా..  హీరోయిన్ రష్మికకు ఈ సినిమా సూపర్ బూస్టప్ ఇచ్చిందనే చెప్పాలి మరి. ఇక ఈ సినిమాకు మొదటగా గీత పాత్రకు మరో ముగ్గురు హీరోయిన్లు సంప్రదించారంట. అయితే దర్శకుడు పరశురామ్ మొదట గీత పాత్రకు.. రకుల్ ప్రీత్ సింగ్ ను సంప్రదిస్తే.. అప్పటికే ఆమె హిందీ సినిమాకు డేట్స్ కేటాయించడంతో ఈ సినిమాను వదులుకున్నారు.

ఆ తరువాత ఈ పాత్రను అను ఇమ్మానియేల్ ను సంప్రదిస్తే తాను కూడా మన బన్నీ పక్కన నా పేరు సూర్య సినిమాకు పని చేస్తూ డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ఈ సినిమాను వదులుకుంది. ఇక మూడోసారి పరశురామ్ రాశి ఖన్నాను సంప్రదిస్తే.. ఆమె కూడా ఈ సినిమాను కాదనుకుని నితిన్ సినిమా శ్రీనివాస కల్యాణంకు సైన్ చేశారంట. ఇక ముగ్గురు హీరోయిన్స్ సినిమాను రిజెక్ట్ చేయడంతో చివరికి ఈ పాత్ర రష్మికకి చేరింది. ఈ సినిమాతోనే రష్మిక ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అంతేకాదు.. గీత గోవిందంను తెరకెక్కించిన పరశురామ్ ఈ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ గా మార్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: