టాలీవుడ్ సినిమా పరిశ్రమలో దర్శకుడు సంపత్ నంది కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. చిన్న సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత స్టార్ హీరోలకు దర్శకత్వం చేసే అవకాశాన్ని అతి తక్కువ కాలంలోనే సంపాదించుకుని స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఆయన తొలి సినిమా వరుణ్ సందేశ్ తో చేయగా రెండో సినిమానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో చేశాడు. ఆ సినిమాతో ఆయన చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.అంతే కాకుండా ఆయన డైరెక్టర్ గా కూడా ఈ సినిమా తో స్థిరపడి పోయాడు.

సినిమా ఇచ్చిన విజయంతో వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేయడం మొదలుపెట్టాడు సంపత్ నంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ అనే సినిమాకు సంపత్ నందిని డైరెక్టర్ గా అనౌన్స్ చేశారు. కానీ పలు కారణాల వల్ల ఆ సినిమా తెరకెక్కలేదు.  పవన్ కళ్యాణ్ వేరే దర్శకుడుని ఆ సినిమాకు ఎంచుకున్నారు. ఆ వెంటనే రవితేజ తో బెంగాల్ టైగర్ అనే సినిమా చేసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. వరుసగా మూడు సినిమాల విజయాలతో హ్యాట్రిక్ కొట్టిన తర్వాత సంపత్ నంది భారీ ఫ్లాప్ ను ఎదుర్కున్నాడు.

 గోపీచంద్ తో చేసిన గౌతమ్ నంద సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోవడంతో ఆయన మళ్ళీ మంచి విజయం కోసం చూడవలసి వచ్చింది. ఈ ఫ్లాప్ తో కొంత డౌన్ఫాల్ అయ్యాడనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే సంపత్ నంది తన తదుపరి సినిమా గోపీచంద్ తోనే సిటీ మార్ అనే సినిమాను మొదలు పెట్టాడు. దాదాపు నాలుగేళ్ల తర్వాత వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు. ఇక తాజాగా సంపత్ నంది మెగాస్టార్ చిరంజీవి తో భేటీ కావడం ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. వరుస సినిమాలతో దూసుకుపోతున్న చిరంజీవి సంపత్ కి ఛాన్స్ ఇచ్చాడా అని చర్చించుకుంటున్నారు. మరి ఇప్పటికే మోహన్ రాజా, మెహర్ రమేష్, బాబీ వంటి దర్శకులకు ఛాన్స్ ఇచ్చిన చిరంజీవి సంపత్ నంది కి కూడా ఛాన్స్ ఇస్తాడో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: