ఇక సీనియర్ హీరో నాగార్జున వేలు పెట్టని బిజినెస్ అంటూ ఉండదు. ఆయన అన్ని రకాల బిజినెస్‌లు చేస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం తాను సంపాదించిన డబ్బును అనేక రంగాల్లో పెట్టుబడి పెట్టేందుకు రెడీ అవుతున్నట్టే కనిపిస్తోంది. అయితే ఎన్టీఆర్ కాస్త కొత్తగా ఫామ్ హౌజ్‌లపై మనసు పారేసుకున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ కూడా హైదరాబాద్ శివార్లలో ఓ స్థలం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో తన అభిరుచికి అనుగుణంగా పెద్ద ఫాంహౌస్ కట్టబోతున్నాడట.
నగర శివార్లలో ఉన్న శంకర్ పల్లికి సమీపంలో గోపాలపురంలో 6 ఎకరాల భూమి కొనుగోలు చేశాడు. ఇటీవలే ఎన్టీఆర్ స్వయంగా వెళ్లి ఈ భూమికి సంబంధించిన రిజస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశాడు. ఇందులో రకరకాల పూల మొక్కలు, గ్రీనరి, విదేశాల నుంచి వచ్చే పూల మొక్కలతో చాలా అందంగా తీర్చిదిద్దనున్నారట. ఎన్టీఆర్ వీకెండ్ లేదా ఇతరత్రా బోర్‌గా ఉన్నప్పుడు వచ్చి ఇక్కడ ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి తన అభిరుచికి అనుగుణంగా దీనిని తీర్చిదిద్దే బాధ్యతలను తీసుకున్నారట. సో మొత్తానికి ఎన్టీఆర్ తన భార్యకు కూడా ఓ బాధ్యత అప్పగించేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి