
అయితే "ఐఓఎస్ఐఎస్" వెల్నెస్ సెంటర్‌కి ఈ తల్లీ కూతుళ్ళకు ఎలాంటి సంబంధం లేదని ఆ సంస్థ ఛైర్‌పర్సన్ కిరణ్ బావా తన సోషల్ మీడియాలో ధృవీకరించారు. ఆన్‌లైన్‌లో వ్యాప్తి చెందుతున్నవి నిరాధారమైన పుకార్లు అని, శిల్పా శెట్టి, ఆమె తల్లిపై కేసు నమోదు అయ్యిందనే దారుణమైన కథనాలలో నిజం లేదని వెల్లడించారు.
శిల్పా శెట్టి, ఆమె తల్లి చాలా కాలం క్రితం తన కంపెనీతో స్నేహపూర్వకంగా విడిపోయారని కిరణ్ బావా స్పష్టం చేశారు. 'అవమానకరమైన కంటెంట్' తన బ్రాండ్ సద్భావనను దెబ్బతీస్తుందని కూడా అన్నారు.
"ఐఓఎస్ఐఎస్" స్పా & వెల్‌నెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్‌గా, బాధ్యతాయుతమైన వ్యక్తిగా నేను ఈ పోస్ట్‌ని చేస్తున్నాను. దయచేసి దీనిని సోషల్ మీడియాలో షేర్ చేయండి. పోస్ట్ చేసే ముందు వాస్తవాలను తెలుసుకోండి. "శ్రీమతి శిల్పా శెట్టి, ఆమె తల్లి శ్రీమతి సునంద శెట్టికి ఐఓఎస్ఐఎస్ తో ఎలాంటి సంబంధం లేదు. మేము చాలా కాలం క్రితం స్నేహపూర్వకంగా విడిపోయాము. కాబట్టి దయచేసి పుకార్లను వ్యాప్తి చేయడం మానేయండి. నేను సింగిల్ పేరెంట్ ని. కష్టపడి పనిచేసే ప్రొఫెషనల్. ఐఓఎస్ఐఎస్ నా బిడ్డ, నేను సంవత్సరాలుగా నిర్మించిన బ్రాండ్. సంబంధిత అధికారులతో వాస్తవాలను నిర్ధారించడం నాకు చాలా సంతోషంగా ఉంది. దీనిపై అప్పటివరకు చేసిన పోస్టులను తొలగించాలని నేను వినయంగా కోరుతున్నాను, ఎందుకంటే ఈ విషయం బొంబాయి హైకోర్టులో ఉంది. ఇక్కడ మాకు అనుకూలంగా ఆదేశాలు ఉన్నాయి" అంటూ పోస్ట్ చేశారు.