జగడం సినిమాలో హీరోయిన్ పాత్ర పేరు కూడా సుబ్బలక్ష్మి కాగా అలాగే 100% లవ్ సినిమాలో హీరోయిన్ పాత్ర పేరు కూడా మహాలక్ష్మి అదేవిధంగా రంగస్థలంలో హీరోయిన్ పాత్ర పేరు రామలక్ష్మి కావడం ఆ పేరంటే ఆయనకు ఎంత ఇష్టమో తెలుస్తుంది.పుష్ప సినిమాలో రష్మిక మందన పాత్ర పేరు కూడా లక్ష్మి అనే పేరు వచ్చే విధంగా ఉండబోతుందని సుకుమార్ ఫ్యాన్స్ ఉహిస్తున్నారట. సుకుమార్ తీసిన ఇతర సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు మరీ క్లాస్ పాత్రలు కావడంతో ఆ సినిమాల్లో మాత్రం సుకుమార్ గీత, సమీరా, దివ్యాంక కృష్ణమూర్తి వంటి పేర్లను ఆ హీరోయిన్ల రోల్స్ కు పెట్టడం జరిగింది.
సుకుమార్ ఈ వార్తకు స్పందించి వివరణ ఇస్తే మాత్రమే లక్ష్మి పేరు ఎక్కువగా పెట్టడానికి సంబంధించిన పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.మరోవైపు పుష్ప సినిమాలో బన్నీని ఎప్పుడు చూడనంత కొత్తగా చూపిస్తున్న సుకుమార్ ఈ మధ్య కాలంలో మాస్ సినిమాలను ఎక్కువగా తెరకెక్కిస్తుండటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.రంగస్థలం సినిమాను మించి పుష్ప భారీ సాధిస్తుందని బన్నీ అభిమానులు ఉహించుకుంటున్నారట. అయితే సీనియర్ నటి ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించబోతున్నారని ఆ నటికి సంబంధించి పుష్ప పార్ట్1 చివరిలో ఒక భారీ ట్విస్ట్ ఉంటుందని ప్రచారం జరుగుతున్నట్లు సమాచారం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి