టాలీవుడ్ సినిమాలో దర్శకుల విషయానికి వస్తే ట్రెండ్ సెట్ చేయాలంటే అది ఒక్క రాజమౌళి కే సాధ్యం అన్నట్లు ఇప్పుడు పరిస్థితి నెలకొంది. టాలీవుడ్ సినిమాలలో పాన్ ఇండియా సినిమాలు మొదలుపెట్టింది రాజమౌళినే.. భారీ యాక్షన్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు కూడా రాజమౌళినే. ఇప్పుడు కూడా మల్టీ స్టారర్ చిత్రాల ట్రెండ్ ను రాజమౌళి మొదలు పెట్టడం విశేషం. ఇప్పటివరకు చిన్నా చితకా మల్టీ స్టారర్ సినిమా లు టాలీవుడ్లో మల్టీస్టారర్ సినిమాలుగా తెరకెక్కాయి.

అయితే ఇద్దరు స్టార్ హీరో లను కలిపి భారీ మల్టీస్టారర్ సినిమా ఎవరు చేయలేదు. అది జక్కన్న చేస్తుండడం విశేషం. ఆయన దర్శకత్వంలో రామ్ చరణ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దసరా కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ పనులను వేగవంతం చేశారు రాజమౌళి. ఇదిలా ఉంటే యువి క్రియేషన్స్ సంస్థ మరొక భారీ చిత్రాన్ని నెలకొల్పేందుకు సిద్ధమవుతోంది.

ఈ సినిమాలో ఇద్దరు పెద్ద హీరోలు నటించ బోతున్నారని ప్రచారం మొదలైంది. ప్రభాస్ సొంత సంస్థ గా పిలువబడుతున్న యువి క్రియేషన్స్ సంస్థ లో ప్రభాస్ హీరోగా ఒక సినిమా తెరకెక్కబోతుంది. ఇందులో మరొక స్టార్ హీరో కూడా నటించబోతున్నాడు. ఆయనే రామ్ చరణ్. ప్రభాస్ కి ఇప్పుడు ఉన్న కమిట్మెంట్ ల తర్వాత చేయబోయే తర్వాత సినిమా ఈ మల్టీ స్టారర్ అని తెలుస్తుంది. ఈ సినిమాలో నటించేందుకు రామ్ చరణ్ కూడా సముఖం గా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాజమౌళికే సాధ్యమైన ఈ తరహా సినిమా వీరికి ఎంత వరకు సాధ్యం అవుతుందో చూడాలి. దర్శకుడిగా ఇంకా ఎవరిని నిర్ణయించలేదు. దర్శకుడిని బట్టి కూడా అలా ఈజీ గా సెట్ అయిపోతాయి కాంబో లు. 

మరింత సమాచారం తెలుసుకోండి: