
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో నటులుగా రాణించి రాజకీయాల్లోకి సైతం వెళ్లారు చాలామంది. అలా సినిమా నటుడి గా రాణిస్తూ రాజకీయాల్లో కి వెళ్ళిన వారిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గిరిబాబు కూడా ఒకరు. 1982వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఆ పార్టీలో చేరడం ద్వారా గిరిబాబు రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఎన్టీఆర్ మీద అభిమానంతో తెలుగు వారికి ఆయన వల్ల మేలు తప్పకుండా జరుగుతుందనే అపారమైన నమ్మకంతో తెలుగుదేశం పార్టీలో చేరారు నటుడు గిరిబాబు.
అయితే ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న కాలంలోనే ఒక రోజు పార్టీకి రాజీనామా చేసి బిజెపి పార్టీలో చేరి అందరిని ఆశ్చర్యపరిచారు. నిజానికి గిరి బాబు అలా ఎందుకు చేశారనేది పార్టీలో ఉన్న చాలామందికి తెలుసు కానీ ప్రజలకు ఎవరికీ తెలియదు. దాంతో ఎన్టీఆర్ ను విడిచి వెళ్లినందుకు ఆయనపై విమర్శలు వచ్చాయి. ఆయన టిడిపి నీ ఎందుకు వదిలేసారు అనేది ఆ తర్వాత కాలంలో ప్రేక్షకులకు వివరించుకున్నాడు.
గిరి బాబు స్వస్థలం ప్రకాశం జిల్లాలోని రావినూతల గ్రామం. అప్పట్లో ఆ ఊరి వాళ్ళు కానీ చుట్టుపక్కల వారు కానీ ఇంటర్మీడియట్ చదువుకోవాలంటే చాలా దూరం వెళ్ళవలసి వచ్చేది. తద్వారా ఆడవారు చదువుకోవాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యేవి. దాంతో తన సొంత గ్రామం లోని ఒక జూనియర్ కాలేజీ పెట్టించాలని గిరిబాబు ప్రయత్నించగా ఆయన తన సొంత భూమి ఒక ఎకరం విరాళంగా ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఊళ్ళో కూడా చందాలు వసూలు చేశారు. అయితే టిడిపి ప్రభుత్వం అక్కడ కాలేజీ ఏర్పాటు చేయడానికి మంజూరు చేయలేదు. అప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఇంద్రారెడ్డి ఉన్నారు. దాదాపు ఆయన ఓకే చేశాడు. కానీ అక్కడ కాలేజీ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వలేదు. దాంతో మనస్తాపం చెందిన గిరిబాబు టిడిపి నుంచి బయటకి వచ్చాడు. ఆ తరువాత ఏ పార్టీలో కూడా ఆయన ఇమడలేకపోయాడు.