టాలీవుడ్ లో యాక్షన్ హీరోగా పేరుపొందాడు గోపీచంద్.. ఇక ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా వస్తున్న చిత్రం సీటీ మార్. ఈ సినిమా ఈ వారంలో విడుదల కానుంది. కొన్ని సంవత్సరాల క్రితం వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం గౌతమ్ నంద. కానీ సినిమా వీరికి ఆశించిన స్థాయిలో సక్సెస్ ని ఇవ్వలేకపోయింది. ఇక సీటీ మార్ సినిమాని ఒక స్టార్ హీరో మిస్ చేసుకున్నాడట.. ఆ వివరాలను చూద్దాం.


సిటీ మార్ మూవీ ప్రమోషన్లలో డైరెక్టర్ సంపత్ నంది కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తను ఈ సిటీ మార్ సినిమాతో భారీ సక్సెస్ ను అందుకోవాలని చూస్తున్నారట. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చే విధంగా తీశాము అని సంపత్ నంది వెల్లడించారు. ఇక ఈ సినిమాకి ముందుగా రామ్ చరణ్ కు అనుకున్నాను. అందులో కోచ్ గా  రామ్ చరణ్ ను  ఊహించుకోలేక పోయానని, అందువల్లే ఆయనకు కథను చెప్పలేదని తెలియజేశాడు.
ఇక ఈ సినిమాకి హీరో కు తగ్గట్టుగా గోపీచంద్ సరిపోతాడని ,తాను అందుకే గోపీచంద్ ను ఈ సినిమాకి ఎంచుకున్నట్లు తెలియజేశాడు. ఇక ఈ సినిమాను గోపీచంద్ కంటే ముందుగా మరొక యువ హీరోకి కథ చెప్పాను అని తెలియజేశారు. ఆ హీరో ఎవరో కాదు రామ్ పోతినేని. తను ఈ పాత్రకి సెట్ కానని చెప్పారని తెలియజేశాడు సంపత్ నంది. ఇక రామ్ అందుచేతనే ఈ కథను రిజెక్ట్ చేశారు అని చెప్పకనే చెప్పారు..

ఇక అదే కథను హీరో గోపీచంద్ కు చెప్తూ, మా ఇద్దరి కాంబినేషన్ లో మరొక బ్లాక్ బాస్టర్ సినిమా రాబోతుందని సంపత్ నంది తెలియజేశారు. కానీ హీరో రామ్  సీటీ మార్ కథ బాగుందని సంపత్ నందికి తెలియజేసినట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో స్టార్ హీరోలతో సినిమాలు తెరకెక్కించాలని సంపత్ నంది అనుకుంటున్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి: