పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కలిసి ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్న మూవీ భీమ్లా నాయక్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా ఎంతో భారీ వ్యయంతో నిర్మితం అవుతున్న ఈ సినిమాలో టైటిల్ రోల్ ని పవన్ కళ్యాణ్ పోషిస్తుండగా డ్యానియల్ శేఖర్ అనే పాత్రలో రానా కనిపించనున్నారు. ఎంతో గ్రాండ్ లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాని సాగర్ కె చంద్ర తీస్తుండగా దీనికి థమన్ సంగీతం అందిస్తున్నారు.

లేటెస్ట్ మలయాళ సక్సెస్ఫుల్ మూవీ అయ్యప్పనుం కోషియం కి తెలుగు రీమేక్ గా రూపొందుతున్న భీమ్లా నాయక్ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పవన్ ఫస్ట్ లుక్ టీజర్, అలానే ఫస్ట్ సాంగ్ అందరి నుండి మంచి క్రేజ్ అందుకుని సినిమాపై బాగానే అంచనాలు క్రియేట్ చేసాయి. ఇక త్వరలో రానా లుక్ టీజర్ ని కూడా విడుదల చేయనున్న యూనిట్, రాబోయే నెలలో దసరా పండుగ రోజున ఈ మూవీ నుండి సెకండ్ సాంగ్ రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు టాక్. మొత్తం ఐదు సాంగ్స్ ఉన్న ఈ సినిమాలో రాబోయే సెకండ్ సాంగ్ డ్యూయెట్ అని అంటున్నారు.

మొత్తం ఐదు సాంగ్స్ తో పాటు సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా థమన్ అదిరిపోయేలా కంపోజ్ చేశారట. నిత్యామీనన్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాపై పవన్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా భారీగా అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమాకి స్క్రిప్ట్ తో పాటు మాటలు కూడా అందిస్తున్నారు పవన్ కళ్యాణ్ మిత్రుడు, మాటల మాంత్రికుడు అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ సినిమాని రాబోయే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా గ్రాండ్ లెవెల్లో థియేటర్స్ లో ప్రేక్షకాభిమానులు ముందుకు తీసుకురానున్నారు యూనిట్ సభ్యులు. మరి తొలిసారిగా పవన్, రానా కలిసి యాక్ట్ చేస్తున్న ఈ భీమ్లా నాయక్ మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: