తెలుగులో మోస్ట్ క్రేజియస్ట్ మూవీగా తెరకెక్కుతున్న చిత్రం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అఖండ, ఈ సినిమాకు తెలుగు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తుండగా ప్రగ్యా జైస్వాల్ పూర్ణా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో సింహ, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి. ఇది హైడ్రిక్ సినిమా కావడంతో ఈ సినిమాపై బాలకృష్ణ అభిమానులతో పాటు మామూలు జనం కూడా అనేక అంచనాలు పెట్టుకున్నారు, దానికి తగినట్టుగానే ఈ చిత్రంలో బాలకృష్ణ రైతుగా అఘోరాగా రెండు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తాడు అని తెలియడంతో జనాల్లో మరింత అంచనాలు పెరిగాయి, దానికి తగ్గట్టుగానే ఆ రెండు పాత్రలకు సంబంధించిన ప్రోమో లను కూడా చిత్రబృందం బయటకు వదలగా వీటికి విశేష స్పందన లభించింది.

 ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా పరిస్థితుల వల్ల విడుదల కాలేదు, మరియు ఇదిలా ఉంటే ఈ సినిమాను పూర్తి చేసి ఈ దసరా పండగ సందర్భంగా విడుదల చేయాలని చిత్రబృందం అనుకున్నట్లే అనేక వార్తలు బయటకు వచ్చాయి, కాకపోతే సినిమా పనులు పూర్తి కాకా పోవడం తో సినిమాలు దసరాకు విడుదల చేయలేక పోయినట్లు తెలుస్తోంది. దసరాకు విడుదల చేసినట్లు అయితే సంక్రాంతికి విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. కాకపోతే ఆర్ఆర్ఆర్ సినిమా ను సంక్రాంతికి కన్ఫామ్ చేయడంతో మరియు సంక్రాంతికి తెలుగు బడా హీరోలు ఆల్రెడీ సినిమా విడుదల తేదీలను ఫిక్స్ చేసుకొని ఉండడంతో సంక్రాంతి కష్టమే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక చూస్తే క్రిస్మస్ కు కూడా భారీగా సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. దీనితో అఖండ సినిమాకు మిగిలిన ఏకైక ఆప్షన్ దీపావళి మాత్రమే అని పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి అఖండ సినిమాను దీపావళి కి తీసుకువస్తారో, లేకపోతే ఏదైనా వేరే తేదీలో విడుదల చేస్తారో తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: