బాలక్రిష్ణ దర్శకత్వంలో మోక్షజ్ఞ తెరంగేట్రం చేస్తాటనే ప్రకటన వచ్చినప్పటి నుంచి నందమూరి అభిమానులు ఈ ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 'ఆదిత్య 369' సినిమా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కొడుకు ఎంట్రీ గురించి మాట్లాడాడు బాలయ్య. 'ఆదిత్య 999'తో మోక్షజ్ఞని లాంచ్ చేస్తానని, కథ కూడా సిద్ధమైందని చెప్పాడు.
'ఆదిత్య369' సీక్వెల్‌గా 'ఆదిత్య 999' సినిమా రాబోతోంది. ఈ మూవీకి బాలకృష్ణే స్వయంగా స్టోరీ లైన్ ఇచ్చానని చెప్పాడు. అలాగే ఈ సీక్వెల్‌ని అయితే సింగీతం శ్రీనివాసరావు, లేకపోతే నేనే డైరెక్ట్ చేస్తానని ప్రకటించాడు. ఈ ఒక్క సినిమాతో మోక్షజ్ఞని ఫుల్లుగా ట్రైన్ చేస్తానని చెప్పాడు. దీంతో తండ్రీకొడుకులు కలిసి నటిస్తే చూడాలని బాలకృష్ణ అభిమానులు ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు.
బాలకృష్ణ ఇప్పుడు వరుస మూవీస్‌తో బిజీగా ఉన్నాడు. 'అఖండ' పూర్తవ్వగానే గోపీచంద్ మలినేని సినిమాలో జాయిన్ అవుతున్నాడు. ఈ మూవీస్‌తో పాటు మరికొన్ని ప్రాజెక్టులు కూడా పైప్‌లైన్‌లో ఉన్నాయనే టాక్ వస్తోంది. అంటే మోక్షజ్ఞ ఈ ఏడాది కూడా కెమెరాముందుకు రావడం కష్టమనే కామెంట్స్ వస్తున్నాయి. మరి 27 ఏళ్ల మోక్షజ్ఞ వచ్చే ఏడాదైనా సినిమాల్లోకి వస్తాడా అనేది చూడాలి. బాలయ్య ఫ్యాన్స్ మాత్రం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి