
సినిమా ఇండస్ట్రీకి కొత్త నటీనటులు కొత్త హీరోయిన్ లు చెప్పాలంటే కొత్త నీరు రావడం అనేది చాలా ముఖ్యం. అప్పుడే ప్రేక్షకులలో సినిమాల పట్ల మంచి ఆసక్తి మంచి క్రేజ్ ఉంటుంది. ఆ విధంగా ఇటీవలే తెలుగు సినిమా పరిశ్రమలోకి కొత్త హీరోలు ఏకంగా అరడజను మంది వచ్చి సినిమా పొకడనే మార్చి వేస్తున్నారు. వారసులు కొత్త వారు ఎలాంటి ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ లేనివారు సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అలా ఈ సీజన్లో ప్రేక్షకులను ఆకట్టుకున్న కొత్త హీరోల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు హీరో కిరణ్ అబ్బవరం. అంతకుముందు రెండు మూడు సినిమాలు చేసినప్పటికీ అవి ఆయనకు పెద్దగా పేరు తీసుకు రాలేదు కానీ ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమా తో మాత్రం ఆయనను హీరోగా గుర్తించింది ప్రేక్షకలోకం. ఆ తర్వాత తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని స్టార్ హీరో అయ్యే రేసులో ఉన్నాడు హీరో వైష్ణవ్ తేజ్. ఆయన తొలి సినిమాతోనే విజయం సాధించాడు అంటే మామూలు విషయం కాదు మెగా కుటుంబం నుంచి వచ్చిన ఈ కుర్రాడు భవిష్యత్తులో ఎలాంటి చరిత్ర సృష్టిస్తాడో చూడాలి.
శ్రీకాంత్ తనయుడుగా రోషన్ పెళ్లి సందడి సినిమా మంచి విజయం అందుకుని ఫామ్ లోకి వచ్చాడు. అంతకు ముందు నిర్మలా కాన్వెంట్ సినిమా చేసినా అది విజయం దక్కలేదు. ఈ సినిమా తర్వాత ఆయన ఎలాంటి సినిమాలలో చేస్తాడో చూడాలి. రెండు మూడు సినిమాలు చేసినా కూడా పెద్దగా కలిసి రాక మంచి విజయం కోసం ఎదురు చూస్తున్నాడు. పూరీ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా ఇప్పుడు రొమాంటిక్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా ఆయనకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
ఇక దిల్ రాజు బ్యానర్ పై ఆయన సోదరుడి కుమారుడు ఆశిష్ రెడ్డి హీరోగా రౌడీ బాయ్స్ సినిమా వస్తుంది. నవంబర్ 19వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇక విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ దొరసాని సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి రెండో సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు పుష్పకవిమానం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈయనే కాకుండా హుషారు సినిమా తో పరిచయమైన హీరో లు కూడా విడివిడి గా తమ సత్తా చాటుతున్నారు.