
విడాకుల తర్వాత సమంత పూర్తిగా తన సినిమాల పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ సినిమా అవకాశాలు మరింతగా పొందే విధంగా తన కెరీర్ ను మలుపు తిప్పు కుంటుంది. ఆమె ఇటీవలే అక్కినేని నాగచైతన్య తో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె టాలీవుడ్ కాకుండా బాలీవుడ్ లోనే ఎక్కువ అవకాశాలు పొందే విధంగా ప్రయత్నాలు చేస్తుంది. ఆ మధ్య బాలీవుడ్ కి చెందిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ లో ఆమె కీలక పాత్రలో నటించి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఈ సినిమా ఆమెకు బాగా క్రేజ్ పెరిగిపోవడానికి ఉపయోగపడిందని చెప్పవచ్చు. ముఖ్యంగా బాలీవుడ్ లో ఆమెకు మరిన్ని అవకాశాలు రావడానికి కూడా ముఖ్య కారణం అయ్యింది. ఆ నేపథ్యంలో ఆమెకు షారుఖ్ సినిమాలో నటించే అవకాశం దక్కినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆ అవకాశాన్ని నయనతార చేజిక్కించుకుంది అని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు నయనతార ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాను రిజెక్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. లయన్ అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా లో నయనతార తిరస్కరించిందట. అందుకే ఈ సువర్ణావకాశం సమంత కు దక్కింది.
ఇటీవలే షారుక్ తనయుడు ఆర్యన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం జరగగా షూటింగ్ ను అర్థంతరంగా ఆపి తన కొడుకును జైలు నుంచి బయటకు తీసుకు వచ్చే పనిలో ఉన్నాడు. దాదాపు మూడు వారాలుగా ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. మళ్ళీ ఎప్పుడు మొదలు అవుతుందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో తన కొత్త ప్రాజెక్టు లకు ఇబ్బంది అవుతుందని ఆమె చేయని చెప్పిందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సమంత ఈ సినిమా కి రావడం నిజంగా అభినందనీయం. ఈ సినిమా ఆఫర్ రావడం లో ఆమె టాలెంట్ కీలక పాత్ర పోషించింది అని చెప్పవచ్చు. ఇక తెలుగులో ఆమె మైథలాజికల్ చిత్రం శాకుంతలం చేయగా అది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటుంది. దర్శకుడు గుణశేఖర్ ఈ చిత్రాన్ని ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.