ఇప్పటి వరకు మనం ఈయన సినిమాలు చూసిన్నట్లైతే ఆ విషయం మనకు బాగా అర్ధమౌతుంది. ఈరోజుల్లో సినిమా మొదలుకొని..ప్రేమ కధా చిత్రం..భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, ప్రతిరోజూ పండగే సినిమా లాంటి బ్లాక్ బస్టర్ హిట్లు టాలీవుడ్ కి అందించారు. అయితే ఇక్కడ అర్ధం కానీ విషయం ఏమిటంటే.. ఇన్ని హిట్లు పడితే ఖచ్చితంగా ఆ డైరెక్టర్ నెక్స్ట్ సినిమాలు పెద్ద పెద్ద బడా హీరోలతో ఉండాలి. కానీ ఇక్కడ అలా లేదు..మారుతి ఖాతాలో వెంకటేష్ తప్పించి పెద్ద హీరో సినిమాలు లేవు. అసలు మారుతి ఇప్పటి వరకూ అగ్ర హీరోలతో సినిమాలు చేయనేలేదు.
అయితే అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో తెలియదు కదా అలా ఇప్పుడు ఈయన ఏకంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితోనే సినిమా తీయ్యబోతున్నాడు. మారుతి డైరెక్షన్లో చిరంజీవి ఓసినిమా చేయ్యబోతున్నడని గత కొద్ది రోజుల నుంది ఓ వార్త బయటకు చక్కర్లు కొడుతుంది. ఇక ఇప్పుడు ఇదే విషయం పై డైరెక్టర్ మారుతి క్లారిటీ ఇచ్చారు. "యస్.. ఆ వార్త నిజమే..చిరంజీవిగారిని కలిసి ఓ స్టోరి లైన్ చెప్పాను. ఆయనకి కూడా బాగా నచ్చేసింది"అని చెప్పుకొచ్చారు. మరి ఈ సినిమా తరువాత నుండి అయినా ఆయన ఖాతలో బడా హీరోస్ హిట్ సినిమాలు పడతాయో లేదో చూడాలి..!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి