కోలీవుడ్ లో అన్బు సెల్వన్ అనే తమిళ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవలే విడుదలైంది. ఈ సినిమాలో హీరో గా విష్ణు విశాల్ నటిస్తున్నాడు. హీరో తో పాటు దర్శకుడు పా . రంజిత్ ఈ సినిమా పోస్టర్ రిలీజ్ చేశారు. పా . రంజిత్ ఎవరో కాదు సూపర్ స్టార్ రజనీ కాంత్ తో కాలా , కబాలీ సినిమాలు తెరకెక్కించారు. ఈ పోస్టర్ రిలీజ్ అయ్యాక దానిపై గౌతమ్ మీనన్ స్పందించారు.
ఈ పోస్టర్ చూశాక అసలు ఇది తాను నటించిన సినిమా నా ? అసలు ఈ సినిమా గురించి తనకు ఎంత మాత్రం తెలియదని.. ఇది నిజంగానే ఓ షాకింగ్ న్యూస్ అని చెప్పాడు. అసలు ఈ సినిమా పోస్టర్ పై ఉన్న దర్శకుడు ఎవరో కూడా తనకు తెలియదని... అతడిని తాను ఎప్పుడూ కలవలేదని కూడా బాంబు పేల్చారు.
అయితే దీనిపై ఈ సినిమా నిర్మాణ సంస్థ ఎంఎం స్టూడియోస్ తన యూట్యూబ్ ఛానెల్ లో కౌంటర్ వీడియో రిలీజ్ చేసింది. మరి దీనిపై గౌతమ్ మీనన్ ఇప్పుడు ఎలా స్పందిస్తారో ? చూడాలి. ఇక గౌతమ్ మీనన్ ఇటీవల పలు సినిమాల్లో నటిస్తున్నారు. అలాగే శింబు నటిస్తోన్న ఓ సినిమాను కూడా డైరెక్ట్ చేస్తున్నారు. ఈ వివాదం ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి