తెలుగు బుల్లితెర పై బిగ్గెస్ట్ రియాలిటీ షో గా ప్రారంభమైన బిగ్బాస్ కార్యక్రమం బుల్లితెర ప్రేక్షకులందరికీ ఎంతగానో కనెక్ట్ అయింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటి వరకు ప్రసారం అయిన అన్ని బిగ్బాస్ సీజన్ లు కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఇక ఇటీవలే ప్రారంభమైన బిగ్బాస్ సీజన్ 5  మరో రెండు రోజుల్లో 70 రోజులు పూర్తి చేసుకోబోతోంది.. ఇకపోతే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్టైన్మెంట్అదిరి పోతుంది అని చెప్పాలి. ముఖ్యంగా బిగ్బాస్ ఏదైనా టాస్క్ ఇచ్చాడు అంటే చాలు ఇక ప్రతి ఒక్కరు కూడా ఈ టాస్క్ లో లీనం అయి పోతున్నారు.




ముఖ్యంగా గత రెండు మూడు రోజుల నుంచి బిగ్బాస్ ఫైవ్ ఎపిసోడ్ లు మరింత ఎంటర్టైనింగ్ గా మారిపోయాయి అని చెప్పాలి. బిగ్బాస్ ఇటీవలే బీబీ హోటల్ అనే టాస్క్ ఇచ్చాడు అన్న విషయం తెలిసిందే. టాస్క్ లో భాగంగా బీబీ హోటల్లో అతిథులుగా ఉన్న వారి దగ్గరనుంచి.. కెప్టెన్సీ కోసం పోటీ చేస్తున్న వారు.. 15 వేల రూపాయలు డబ్బులు తీసుకోవాల్సి ఉంటుంది. అలా తీసుకున్న వారే కెప్టెన్సీ పోటీదారులుగా నిలుస్తారు. అయితే ఈ బీబీ హోటల్ టాస్క్ లో భాగంగా ప్రతి ఒక్కరూ ఒక పాత్రలో లీనమైపోయి టాస్క్ చేస్తున్నారు. అయితే బిగ్బాస్ ఐదో సీజన్లో ప్రేమ పావురాలు మానస్ పింకీ కోసం మరింత స్పెషల్ రోల్స్ ఇచ్చారు.



 ఏకంగా కొత్తగా పెళ్ళయ్ హనీమూన్ కి  వెళ్లిన కొత్తజంట పాత్రలను మానస్ పింకీ కి ఇచ్చాడు. ఈ క్రమంలోనే కొత్తగా రడీ అయ్యి ఈ ఇద్దరు కూడా బిగ్ బాస్ హౌస్ లో మొత్తం తిరుగుతుంటారు. ఈ క్రమంలోనే వీరిని ఇంప్రెస్ చేయడానికి ఇక హోటల్ సిబ్బంది పాత్ర లో ఉన్న కంటెస్టెంట్స్ మొత్తం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పాలి. అయితే కొత్తగా హనీమూన్ కి వచ్చిన ఈ జంట కోసం ఏకంగా హోటల్ మేనేజర్ గా ఉన్న అని మాస్టర్  ఏకంగా ఒక బెడ్ రెడీ చేయడం మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఏకంగా ఫస్ట్ నైట్ కోసం రెడీ చేసినట్లుగా పువ్వులు పరిచి ఒక బెడ్ రెడీ చేసింది అని మాస్టర్. ఇక వీరిద్దరి కూడా అక్కడికి పిలుస్తోంది. కానీ అంతలో అక్కడికి వచ్చిన సన్నీ ఆ ప్లాన్ మొత్తం చెడగొడతాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: