పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి తెలియని వారుండరేమో. మరాఠీ భాష కు చెందిన రేణుదేశాయ్ తెలుగు సినిమాల ద్వారా ముందుకు వచ్చి నటిగా తనని తాను నిరూపించుకుంది. ఆ తర్వాత ఆమె పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకుని తన సంసార జీవితాన్ని  ముందుకు తీసుకెళ్ళలేకపోయింది. 2004వ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ నటించిన బద్రి సినిమా ద్వారా తెలుగు సినిమాల్లోకి ప్రవేశించిన ఈమె 2009వ సంవత్సరంలో ఆయనను పెళ్లి చేసుకుంది.

వీరికి 2010 లో ఓ కూతురు జన్మించగా 2011 వ సంవత్సరం లో వీరిద్దరికీ విడాకులు అవ్వడం అప్పట్లో వీరి అభిమానులను ఎంతగానో నిరాశపరిచింది. ప్రస్తుతం ఆమె వేరొకరిని పెళ్లి చేసుకుని తన జీవితాన్ని ముందుకు సాగిస్తుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో కొన్ని సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపుతోంది రేణు దేశాయ్. ఇప్పటికే పలు టీవీ షోలలో కూడా ఆమె కనిపిస్తూ తను ఎంత బిజీగా ఉన్నా చాటి చెపుతోంది. మధ్య మధ్యలో తన సోషల్ మీడియా ద్వారా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసి అందరినీ తన వైపు చూసేలా చేసుకుంటుంది.

పవన్ కళ్యాణ్ కు అంతకుముందే ఓ పెళ్లి అయ్యి అది విడాకులకు దారి తీయ గా మళ్ళీ రేణుదేశాయ్ తో కూడా ఆయన ఎక్కువ రోజులు కాపురం చేయలేకపోయాడు. ప్రస్తుతం మూడో పెళ్లి చేసుకొని ఆమెతో జీవిస్తున్నాడు. ఇటు నటన అటు రాజకీయాలు రెండు కలిపి పవన్ కళ్యాణ్ తన జీవితాన్ని బిజీ చేసుకోగా ఉన్నన్ని రోజులు ఎలాంటి కలహాలు కలతలు లేకుండా ఎంతో హాయిగా జీవించారని చెప్పాలి. కానీ భార్యాభర్తల మధ్య ఎందుకు పొరపచ్ఛాలు వస్తాయో ఎవరూ చెప్పలేరు. కాబట్టి వీరిద్దరూ చిన్న చిన్న కారణాలతో విడిపోయారు అని చెబుతూ ఉంటారు. ఏదేమైనా పవన్ తో ఉన్నన్ని రోజులు రేణుదేశాయ్ ఆయనకు వెన్నంటి ఉండి ఆయన ఎంతో ఎత్తుకు ఎదిగేలా చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: