తెలుగు బుల్లి తెరపై ఎంతో సక్సెస్ఫుల్ గా కొనసాగుతున్న రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటి వరకు నాలుగు సీజన్లను కంప్లీట్ చేసుకుని ఇపుడు అయిదవ సీజన్ విజయవంతంగా కొనసాగుతోంది. ఇంకో మూడు వారాల్లో ఈ షో కూడా ముగియనుంది.  బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో విజేతగా ఎవరు నిలుస్తారు అన్న విషయం హాట్ టాపిక్ గా ఉంది. టాప్ లిస్ట్ లో సన్ని మరియు షన్ను, శ్రీ రామ్ చంద్ర పేర్లు మార్చి మార్చి విన్పిస్తున్నాయి. ఈ సీజన్ గ్రాండ్ ఫినాలేని ఓ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారట బిగ్ బాస్ యాజమాన్యం. ఈ ఫినాలే కోసం భారీ మొత్తంలో సొమ్ములు కుమ్మరించి అట్టహాసంగా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఇపుడేమో తాజాగా బిగ్ బాస్ హౌజ్ నుండి ఓ మెగా బిగ్ న్యూస్ వినిపిస్తోంది. సీజన్ ఫైవ్ విన్నర్ కి ఈసారి ట్రోఫీ ఇచ్చేందుకు ఒకరు కాదు ఏకంగా ఇద్దరు స్టార్ హీరోలు గ్రాండ్ ఫినాలేకి రానున్నారట. అదికూడా టాలీవుడ్ అగ్ర హీరోలు కావడం విశేషం. ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ టాపిక్ అంటే 'ఆర్ ఆర్ ఆర్' మూవీ. అయితే ఇపుడు ఈ చిత్రంలో లీడ్ రోల్స్ చేసిన హీరోలు రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ లు ఇరువురు కలిసి బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఫినాలే స్టేజ్ పైకి రాబోతున్నట్లు సమాచారం. ఈ బిగ్ సెలబ్రిటీలు ఇద్దరు కలిసి బిగ్ బాస్ సీజన్ ఫైవ్ విన్నర్ కి ట్రోఫీ ఇవ్వబోతున్నారు అంటూ ప్రచారం మొదలయ్యింది.

ప్రమోషన్ అక్కర్లేని సినిమా అయినప్పటికీ బిగ్ బాస్ షోకి ప్రస్తుతం హోస్ట్ గా చేస్తున్నటువంటి నాగార్జున స్పెషల్ గా పిలవడంతో వీరు విచ్చేయనున్నారని వార్తలు వినపడుతున్నాయి. అంతే కాకుండా ఫైనల్ రోజున ఈ షో ను వీక్షించే ప్రేక్షకుల సంఖ్య ఏ స్థాయిలో ఉంటుంది అనేది తెలిసిందే. అందుకే ఈ అవకాశం ఆర్ ఆర్ ఆర్ సినిమాకు బాగా కలిసొస్తుంది. మరియు ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ల కోసం షో చూసే వారు కూడా లేకపోలేదు. అందుకే ఇరువురికి అడ్వాంటేజ్ అవుతుందని ఈ నిర్ణయం తీసుకున్నారట. మరి ఇందులో ఎంత నిజముందో? నిజంగానే ఆర్ ఆర్ ఆర్  హీరోలు గ్రాండ్ ఫైనలేకు వస్తారా అన్న విషయం తెలియాలంటే ఇంకో మూడు వారాలు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: