బిగ్బాస్ కార్యక్రమం ప్రస్తుతం తెలుగు బుల్లితెర పై మోస్ట్ వాంటెడ్ షో గా మారిపోయింది. బిగ్బాస్ 5వ సీజన్ చివరి దశకు చేరుకోవడంతో బుల్లితెర ప్రేక్షకులు అందరూ కూడా ఈ కార్యక్రమం పైనే దృష్టిపెట్టారు  అని చెప్పాలి. ఇక ప్రస్తుతం హౌస్ లి కేవలం ఏడు మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. ఈ క్రమంలోనే ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనేది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే బిగ్బాస్ మరి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ఇన్ని రోజుల వరకూ గ్రూపుగా ఆడిన వారు ఇక ఇప్పుడు మాత్రం ఇండివిడ్యువల్ గేమ్ ఆడాలి అని భావిస్తున్నారు. దీంతో ఎవరితో ఎలాంటి ఎమోషన్ కనెక్టింగ్ పెట్టుకోవడం లేదు.


 ఇక ఇటీవల గత వారం రవి ఎలిమినేట్ కావడంతో ఎప్పుడు ఎవరు హౌస్ నుండి ఎలిమినేట్ అవుతారు అన్నది కూడా ఊహకందని విధంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే  రవి ఎలిమినేషన్ తర్వాత బాటు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సభ్యులందరూ కూడా ఒక్కసారిగా షాకయ్యారు. ఈ క్రమంలోనే ఎప్పుడు ఎవరు ఎలిమినేషన్ జరుగుతుందో కూడా తెలియదు కాబట్టి చివరికి అందరూ అప్రమత్తమై పోయారు.. బిగ్ బాస్ హౌస్ లో ఎంతో వ్యూహాత్మకంగా గేమ్ ఆడటానికి ఇష్టపడుతున్నారు.. అయితే బిగ్బాస్ మొదలైనప్పటి నుంచి హౌస్ లో ప్రేమ పావురాలు గా కొనసాగుతున్నారు మానస్ పింకీ లు.


 మిగతా ఇంటి సభ్యులు అందరూ ఒక దగ్గర ఉంటే వీరిద్దరు మాత్రం ఒక దగ్గర ఉండేవారు. పింకీ మానస్ పై అమితమైన ప్రేమను చూపిస్తూ సపర్యలు చేస్తూ ఉండేది. నీ గేమ్ నువ్వు ఆడు ఎవరి మీద డిపెండ్ అవ్వకు ఎవరికోసం హౌస్ లోకి రాలేదు అని పలుమార్లు హౌస్ లోని కంటెస్టెంట్ పింకీ కి సూచించినప్పటికీ పింకీ మాత్రం మానస్ వెంటే తిరుగుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఎపిసోడ్ చూసుకుంటే మానస్ లో ఎంతగానో మార్పు వచ్చింది అని తెలుస్తోంది. కనీసం పింకీ తో మాట్లాడటానికి కూడా ఇష్టపడటం లేదు మానస్. ఇటీవలే విడుదలైన ప్రోమో లో మానస్ పింకీ మధ్య గొడవ లే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా చూపించారు. నాకు నచ్చడం లేదు అందుకే మాట్లాడటం ఇష్టం లేదు అంటూ మానస్ ముఖం మీద చెప్పడంతో ప్రియాంక ఫీల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: