సౌత్ సూపర్ స్టార్ ధనుష్, నటి సారా అలీ ఖాన్ నెక్స్ట్ చిత్రం 'అత్రంగి రే' గురించి ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఒక విచిత్రమైన షరతుతో సల్మాన్ ఖాన్ 'అత్రంగి రే' టైటిల్ హక్కులను తనకు ఇచ్చారని దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ చెప్పారు.సినిమా వ్యాపారంలో ఉన్నప్పుడు టైటిల్‌ సీరియస్ వ్యవహారం అన్న విషయం తెలిసిందే. చిత్రనిర్మాత ఆనంద్ ఎల్ రాయ్ తన రాబోయే రెండు చిత్రాలకు పేర్లు పెట్టే సమయంలో జరిగిన విషయాలను వెల్లడించారు.

దర్శక, నిర్మాత ఆనంద్ ఎల్ రాయ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'అత్రంగి రే' నుండి 'రక్షా బంధన్' వరకు నా కెరీర్‌లో అత్యంత సంక్లిష్టమైన చిత్రాన్ని నిర్మించాను. అన్నాచెల్లెళ్ల ప్రేమ సాధారణ కథ. ఈ రెండు సినిమాల టైటిల్ కోసం ఫిల్మ్ అసోషియేషన్‌కి వెళ్లినప్పుడు ‘అత్రంగి రే’ టైటిల్‌ని పెట్టలేకపోయాను అంటూ ఈ సినిమాలకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ ఉదంతం చెప్పాడు. కానీ 'రక్షా బంధన్‌' సినిమా టైటిల్‌ను ఎవరూ రిజిస్టర్‌ చేయలేదు. 'అత్రంగి రే' టైటిల్ రైట్స్‌ను దక్కించుకున్న కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉందని దర్శకుడు తెలిపారు. సల్మాన్ భాయ్ తన ప్రొడక్షన్ హౌస్‌లో ఈ టైటిల్‌ను రిజిస్టర్ చేయించారని రాయ్ చెప్పారు. కానీ ఆయన నేను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తే మాత్రమే టైటిల్ హక్కులు ఇస్తాను. లేకుంటే వదలనని అన్నారు" అంటూ చెప్పుచ్చారు రాయ్.

సారా అలీఖాన్, అక్షయ్ కుమార్, సౌత్ సూపర్ స్టార్ ధనుష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అత్రంగి రే’. సారా అలీఖాన్‌, ధనుష్‌ మధ్య ప్రేమకథను ఈ చిత్రంలో చూపించారు. ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులకు బాగా నచ్చింది. సారా అలీ ఖాన్ తన ప్రేమ కోసం పదేపదే ఇంటి నుండి పారిపోయే రింకూ అనే అమ్మాయి పాత్రను పోషిస్తోంది. ఈ చిత్రంలోని మొదటి పాట 'చక చక్' విడుదలైంది. సారా అలీఖాన్‌పై ఈ పాటను చిత్రీకరించారు. చకా చక్‌ను పాటను శ్రేయా ఘోషల్ పాడారు. ఏఆర్ రెహమాన్ స్వరపరిచారు. ఆనంద్ ఎల్ రాయ్  దర్శకత్వం వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: