యువరత్న నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన అఖండ‌ సినిమా ఈ నెల 2వ తేదీన థియేటర్ లోకి వచ్చింది. అఖండ‌ సినిమా కు తొలి షో నుంచి సూపర్ డూపర్ హిట్ టాక్ వచ్చేసింది. ఇప్పటికే దాదాపు అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ కు వచ్చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్ల షేర్ తోపాటు 70 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లు కొల్లగొట్టింది. పుష్ప‌ సినిమా రిలీజ్ అయ్యే వరకు బాక్సాఫీస్ దగ్గర ఎదురేలేదు. దీంతో లాంగ్ రన్ లో అఖండ మరిన్ని వసూళ్లు సాధిస్తుంది ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అఖండ సినిమాను ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రతి ఒక్కరూ తమ వంతు గా ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా వచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబు - కలెక్షన్ కింగ్ మోహన్ బాబు  - యంగ్ టైగ‌ర్ ఎన్ టైగర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు కూడా ఈ సినిమా అద్భుతంగా ఉందని ప్రశంసించారు. రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా అఖండ అద్భుతంగా ఉంది అంటూ కీర్తిస్తున్నారు.

ఇక అఘోరాలు , హిందుత్వ వాదులు సైతం అఖండ సినిమా సూపర్ అని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్ద కుమార్తె బ్రాహ్మణి సైతం ఈ సినిమా చూసి తన స్పందన తెలియజేశారు. అఖండ అద్భుతంగా ఉందని అప్పుడు తాతగారు ... ఇప్పుడు నాన్నగారు సినీ ఇండస్ట్రీ స్టాండర్డ్ పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని ప్ర‌శంసించారు.

గతంలో నాన్నగారు చేసిన సినిమాలకు మించి అఖండ సినిమా ఉందని... నిజంగా ఒక తెలుగింటి ఆడపడుచుగా పుట్ట‌డం తనకు ఎంతో గర్వంగా ఉందని... ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ ఈ సినిమాను తప్పకుండా చూడాలని బ్రాహ్మణి ఆకాశానికి ఎత్తేసారు. ఏదేమైనా అఖండ మానియా అయితే తెలుగు ప్రజల్లో మామూలుగా లేదనే చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: