తెలుగు టెలివిజన్ చరిత్రలోనే అతి పెద్ద రియాలిటీ షోగా ప్రసారమౌతున్న బిగ్ బాస్ షో పుణ్యామాని చాలా మంది సెలబ్రిటీలు గా మారుతున్నారు. బిగ్ బాస్ ఆఫర్ అందుకుని హౌస్ లోకి అడుగుపెట్టి..కొన్ని రోజులు ఉండి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాక ..వాళ్లకు పాపులారిటీతో పాటు సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే ఇలాంటి ఆఫర్స్ అందుకున్న బిగ్ బాస్ కంటెస్టేంట్ లని మనం చాలా మందినే చూసాం. తాజాగా ఆ లిస్ట్ లోకి చేరిపోయాడు బిగ్ బాస్ మాజీ కంటెస్టేంట్ లోబో.

ఒక‌ప్పుడు బుల్లి తెర పై చిన్న షోస్ లో మెరిసిన ఈయన ఆ తరువాత కొన్ని  సినిమాలో కూడా చిన్న పాత్రల్లో నటించి .. తనదైన నటనతో యాక్ట్  చేసుకుంటూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూ వచ్చాడు. ఇక అలా తనకు  బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ఆఫర్ వచ్చింది. హౌస్ లో కూడా ఫుల్ కామెడీతో కడుపుబ్బ నవ్వించి.. కొన్ని వారాలకు ఓటింగ్ శాతం తగ్గడంతో ఎలిమినేట్ అయ్యాడు. ఇక హౌస్ నుండి బయటకు వచ్చాక ఆయన ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ఇప్పటికే పలు కమెడీ షోలు చేస్తున్న ఆయన మెగాస్టార్ సినిమాలో చేసే  ఆఫ‌ర్ అందుకున్నాడు.

తాజా సమాచారం ప్రకారం లోబోకి చిరంజీవి- మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌కత్వంలో రాబోతున్న  భోళా శంక‌ర్ చిత్రం లో నటించే  అవకాశం వ‌చ్చినట్టు తెలుస్తుంది. ఈ విషయమై లోబో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. ఇక సినిమా గురించి చెప్పుతూ... "ఈ సినిమాలో నా పాత్ర ఎప్పుడు చిరంజీవి సార్‌ని అంటిపెట్టుకుని ఉండేలా ఉంటుంది. మెగాస్టార్‌ సార్ పక్కన నటించడం అనేది నా కల. ఈ సినిమాతో ఆ కల సాకారమైనట్లే" అని చెప్పుకొచ్చాడు. ఇక భోళా శంక‌ర్ సినిమాలో చిరంజీవి పక్కన తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా..కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: