నందమూరి బాలకృష్ణ అన్స్టాపబుల్ మోడ్ లో ఉన్నాడట.'అఖండ' సినిమా సక్సెస్ అయ్యిందని ఆహా వారి కోసం చేస్తున్న 'అన్స్టాపబుల్' డబుల్ సక్సెస్ అయ్యిందని తెలుస్తుంది.ఇక త్వరలోనే గోపీచంద్ మలినేని మరియు అనిల్ రావిపూడి వంటి టాప్ డైరెక్టర్లతో వర్క్ చేయబోతున్నాడని మధ్యలో ఓ మల్టీస్టారర్ కూడా ఉందట. సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే 'ఆహా' వారి కోసం బాలకృష్ణ వరుసగా స్టార్స్ ను ఇంటర్వ్యూలు చేస్తున్నాడట.మొన్నటికి మొన్న మహేష్ బాబుని ఇంటర్వ్యూ చేసాడని తెలుస్తుంది..
ఆ ఎపిసోడ్ ను ఆహా వారు బాగా దాస్తున్నారని సమాచారం.మంచి టైం చూసుకుని విడుదల చేస్తారని తెలుస్తుంది.. ఇక తాజాగా రాజమౌళిని కూడా ఇంటర్వ్యూ చేసాడట బాలయ్య. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ అయ్యిందని తెలుస్తుంది.అదేంటి ఇంకా మహేష్ బాబు ఎపిసోడ్ చేయకుండా అప్పుడే రాజమౌళి ఎపిసోడ్ రిలీజ్ చేసేస్తున్నారా? అనే డౌట్ మీకు రావచ్చు కదా 'ఆర్.ఆర్.ఆర్' రిలీజ్ కు సమయం దగ్గర పడుతుంది కదా కాబట్టి ప్రమోషన్లలో భాగంగా ఈ ఎపిసోడ్ ను ముందుగా విడుదల చేయబోతున్నారని స్పష్టమవుతుందట.
'మీరు ఆల్రెడీ ఇంటెలిజెంట్ అని అఛీవర్ అని అందరికీ తెలుసు. మరి ఇంకా ఎందుకు ఈ తెల్ల గెడ్డం అని ప్రశ్నించారట.
'ఇప్పటిదాకా మన కాంబినేషన్ పడలేదు కదా నా అభిమానులు మిమ్మల్ని బాలయ్యతో సినిమా ఎప్పుడు చేస్తున్నావ్ అని అడిగారు మీ సమాధానం ఏంటసలు అని అడిగారట.
'మీతో సినిమా చేస్తే హీరోకి ఇండస్ట్రీకి హిట్ ఇస్తారట కదా ఆ తర్వాత వాళ్ళ నెక్స్ట్ రెండు, మూడు సినిమాలు ఫసకేగా?అంటూ బాలయ్య ప్రశిస్తున్నప్పుడు రాజమౌళి కాసేపు మీసాలు తిప్పుతూ మరియు మరోసారి తల గోక్కుంటూ.. వింత వింత ఎక్స్ప్రెషన్లు ఇచ్చాడని తెలుస్తుంది.. దీంతో బాలయ్య 'ఏంటి.. సమాధానాలు చెప్పరేంటి రాజమౌళి అని బాలయ్య గట్టిగా అరవగా.. అందుకు రాజమౌళి 'మీకు తెలుసు షూట్ చేసేవాళ్ళకి తెలుసు అందరికీ తెలుసు ఇది ప్రోమో అని సమాధానాలు ఎపిసోడ్లోనే చెబుతా' అంటూ పంచ్ వేసాడని తెలుస్తుంది.