అయితే ఆగడు సినిమా తర్వాత ఆయన కెరీర్ అంత బాగా లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ఏ సినిమా చేసినా కూడా అది ఫ్లాప్ అవుతూ వస్తూ ఆయనను రోజు రోజుకు దిగజార్చుతుంది. వరుసగా సినిమాలు అన్ని పోవడంతో శ్రీనువైట్ల ను ఎవరు పట్టించుకోలేదు. ఆయన సూపర్ హిట్ ఇచ్చిన హీరోలు సైతం ఆయనతో సినిమాలు చేయడానికి వెనకాడారు. దాంతో ఆయన చివరి ప్రయత్నంగా ఇప్పుడు మంచు విష్ణుతో కలిసి ఢీ అండ్ ఢీ అనే సినిమా చేస్తున్నాడు.
వీరి కలయిక లో వచ్చిన ఢీ అనే సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంటుంది అనే నమ్మకాన్ని వ్యక్త పరుస్తున్నారు. అయితే స్వయం కృత తప్పులతో తన కెరీర్ను దిగజార్చుకున్న శ్రీనువైట్ల ఇప్పుడు తన కెరియర్ ను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో పెద్ద హీరోలతో కూడా సినిమా చేస్తాను అనే నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చెప్పిన ఈ మాటను నిలబెట్టుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఆయన అభిమానులు దీన్ని తొందరగా నిలబెట్టుకోవాలని చెబుతున్నారు. మరి ఇది జరగాలంటే ఇప్పుడు చేసే విష్ణు సినిమా తో తప్పకుండా మంచి విజయాన్ని అందుకోవాలి.. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో విజయం అందుకుంటుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి