‘అఖండ’ సూపర్ సక్సస్ తో పాటు ‘అన్ ష్టాపబుల్’ షో కూడ జనానికి విపరీతంగా నచ్చడంతో ఇప్పుడు బాలకృష్ణ హవా తారా స్థాయిలో ఉంది. ఈక్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని బాలకృష్ణతో లేటెస్ట్ గా మూవీ చేస్తున్న గోపీచంద్ మలినేని తన మూవీ స్క్రిప్ట్ లో అనేక మార్పులు చేసినట్లు టాక్. ఈమూవీలో బాలకృష్ణ ద్విపాత్రాభిమానియం చేస్తున్న సందర్భంలో ఒక పాత్రకు విజయశాంతిని మరొక పాత్రకు శృతి హాసన్ ని ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
జనవరి మొదటివారంలో షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈమూవీ షూటింగ్ ను పరుగులు తీయించి వచ్చే ఏడాది దసరాకు విడుదలచేయాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈమూవీ తరువాత బాలయ్య అనీల్ రావిపూడి మూవీలో నటించవలసి ఉంది. వాస్తవానికి ఈమూవీ విడుదలకు రెడీగా ఉన్నప్పటికీ ఈమూవీని ఏప్రియల్ దాకా విడుదల చేసే పరిస్థితులు లేవు.
దీనితో అనీల్ రావిపూడి బాలయ్య గోపీ చంద్ ల షూటింగ్ పూర్తి అయ్యేదాకా వేచి ఉండాలా లేకుంటే ఈ గ్యాప్ లో ఒక చిన్న సినిమాను తీసి ఆతరువాత బాలయ్య సినిమా కోసం రెడీ అవ్వాలా అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నట్లు టాక్. అయితే ఇప్పుడు అనీల్ రావిపూడికి కూడ బాలయ్య సినిమా విషయమై కొన్ని సందేహాలు మొదలైనట్లు తెలుస్తోంది.
సాధారణంగా బాలయ్య సినిమాలలో యాక్షన్ సన్నివేశాలు చాల ఎక్కువగా ఉంటాయి. అయితే అనీల్ రావిపూడి సినిమాలలో కామెడీ సీన్స్ ఎక్కువగా ఉంటాయి. బాలకృష్ణ కెరియర్ తొలిరోజులలో కొన్ని కామెడీ సినిమాలలో బాలయ్య నటించినప్పటికీ ఆతరువాత నందమూరి సింహంగా మారిపోయిన తరువాత అన్నీ యాక్షన్ సినిమాలే చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులలో అనీల్ రావిపూడి కూడ బాలయ్యకు సరిపోయే కథ విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించ వలసిన పరిస్థితి అంటున్నారు. దీనితో అనీల్ రావిపూడి కోసం బాలయ్య మారుతాడా లేకుంటే బాలయ్య కోసం అనీల్ రావిపూడి మారుతాడ అన్న కన్ఫ్యూజన్ కొనసాగుతోంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి