1. రాశీ ఖన్నా:
నటిగా ఒక మంచి మనసున్న వ్యక్తి గా .. మరింత బెటర్ గా ఉండాలని.. ఈ కొత్త ఏడాది తాను తీసుకున్న రిజల్యూషన్ ఇదేనని తెలిపింది రాశీ ఖన్నా. ఇక ఈమె మాట్లాడుతూ పోయిన ఏడాది సినిమాల ద్వారా సంతృప్తిగా అనిపించింది అని.. అద్భుతమైన ఛాన్సులు కూడా వచ్చాయని.. ఇక ఈ సంవత్సరం కూడా తానేమిటో నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ తెలిపింది. అంతేకాదు కొత్త సంవత్సరంలో ఉన్నతంగా జీవించాలని అనుకోవడం తో పాటు ప్రపంచం పట్ల పాజిటివ్ గా ఉండటం అలాగే దక్కిన విషయంలో కృతజ్ఞతా భావంతో పని చేయడం ఇదే ఈ కొత్త సంవత్సరం రిజల్యూషన్ అంటూ ఆమె తెలిపింది.2. పూజా హెగ్డే:
కొత్త సంవత్సరం కొన్ని కొత్త టార్గేట్లు పెట్టుకున్నానని ఖచ్చితంగా ఈ ఏడాది వాటన్నింటినీ నెరవేర్చుకుంటానని మీరు పూజ 2.0 ను చూడవచ్చు అని ఆమె తెలిపింది.3. లావణ్య త్రిపాఠి:
ఇతరులతో పోల్చుకోకుండా తానేంటో కెరీర్లో దూసుకుపోవాలనీ అనుకుంటున్నట్లు ఆమె తెలిపింది.4. శివాని రాజశేఖర్:
కొత్త సంవత్సరం ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని.. ఎన్ని అనుకున్నా జరగాల్సింది కచ్చితంగా జరుగుతుంది అని ఆమె తెలిపింది.5. మీనాక్షి చౌదరి:
ఎక్కడ ఎలా ఉండాలో బాగా తెలిసింది అని .. వృత్తిని, ఆరోగ్యాన్ని బ్యాలెన్స్డ్ గా చూసుకోవడమే ఈ కొత్త సంవత్సరం రిజల్యూషన్ అని తెలిపింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి