వచ్చే వారంలో లాక్డౌన్ పెట్టే అవకాశాలు కూడా ఉన్నందువల్ల థియేటర్ల వద్ద ఆంక్షలు..బందులు..నైట్ కర్ఫ్యూలు ఇలా రకరకాల ఇబ్బందుల మధ్య ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు మరో పాన్ ఇండియా సినిమా సంక్రాంతి బరిలో ఉన్న రాధే శ్యామ్ కూడా వాయిదా వేయబోతున్నారు అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇక పోతే ఇలాంటి సమయంలోనే అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ను బాగా షేర్ చేస్తూ.. వైరల్ గా మారుతున్నారు..ఇకపోతే పుష్ప సినిమాలో కొన్ని డైలాగులు బాగా ఫేమస్ అయిన విషయం తెలిసిందే. అందులో ఒక డైలాగ్ ను కాస్త అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.. అంటే బన్నీ ఉంటే కరోనా ఉండదు కరోనా ఉంటే బన్నీ కనిపించడు.. అవును నిజమే.. ఎందుకంటే గత ఏడాది అలా వైకుంఠపురం సినిమా వచ్చిన సమయంలో కూడా సినిమాకు ఎలాంటి కరోనా దెబ్బ పడలేదు. పుష్ప సినిమా కూడా విడుదలై రెండు వారాలు పూర్తయింది.. కాబట్టి ఇప్పుడు కూడా కరోనా బన్నీ సినిమాలు ఏమీ చేయలేకపోయింది . అంతేకాదు ఏకంగా 300 కోట్ల రూపాయలు వసూలు చేసి.. ఇండియన్ బిగ్గెస్ట్ చిత్రాల జాబితాలో టాప్ లో నిలవడం గమనార్హం. అందుకే బన్నీ గ్రేట్ అంటూ అభిమానులు ఇలా ట్రోల్ చేయడం వైరల్ గా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి