పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తర్వాత కొంతకాలం పాటు సినిమాలకు దూరం అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణం లో తెరకెక్కిన వకీల్ సాబ్  సినిమాతో తిరిగి ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో అదే జోష్ లో పవన్ కళ్యాణ్ వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు దగ్గుబాటి రానా కూడా హీరోగా కనిపించబోతున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో పాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ అంగీకారంతో క్రిష్ జాగర్లమూడి, పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కొండాపొలం  అనే సినిమాను చిత్రీకరించాడు.

సినిమా కొన్ని రోజుల క్రితమే విడుదల కావడంతో మళ్లీ తిరిగి హరిహర వీరమల్లు సినిమాను ప్రారంభించబోతున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా ఆడియో గ్లోబల్ రైట్స్ ను బాలీవుడ్ కి చెందిన పాపులర్ ఆడియో సంస్థ టిప్స్ ఫ్యాన్సీ ధర చెల్లించి  దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ఈ సినిమాలతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో లో భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో నటించడానికి రెడీగా ఉన్నాడు. ఈ సినిమాతో పాటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా ఒక సినిమాలో నటించడానికి పవన్ కళ్యాణ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇప్పటికే జరిగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: