అక్కినేని ఫ్యామిలీ హీరోలు నటించే చాలా సినిమాలకు అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే.. ముఖ్యంగా మనం సినిమా తో అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసి మంచి విజయాన్ని అందించాడు.. ఈ సినిమాలో వచ్చిన ప్రతిపాట కి ట్యూన్ చాలా చక్కగా అందించి.. పాటలతోనే ఈ సినిమా సెన్సేషన్ విజయాన్ని క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలో అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేసి అటు ఫ్యామిలీ ఆడియెన్స్ ను , ఇటు యువతను చాలా బాగా ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మరోసారి అక్కినేని ఫ్యామిలీకి లక్కీ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయారు..


తాజాగా విడుదలైన బంగార్రాజు సినిమా కి కూడా అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసిన విషయం తెలిసిందే.. ఇక ఈ సినిమా మొదటి షో తోనే బ్లాక్ బాస్టర్ టాక్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమాలో ప్రతి పాట , మ్యూజిక్ అన్నీ కూడా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా నిజంగానే సంక్రాంతి అల్లుళ్ళు వచ్చినంత సంబరంగా సాగిపోతోంది. బహుశా పెద్ద సినిమాలు వచ్చినప్పటికీ ఈ సినిమాకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వారేమో ప్రేక్షకులు.. అంతలా పాటల పరంగా సినిమా పరంగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది..

ఇకపోతే ఈ సినిమాలో నాగచైతన్య తన డైలాగులతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నాడు.. కృతి శెట్టి, రమ్యకృష్ణ, నాగార్జున ఇలా ప్రతి ఒక్కరు కూడా తమ పాత్రలలో లీనమై పోయి ప్రేక్షకుల చేత మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా తమ పాత్రలతో కట్టిపడేస్తున్నారు.. అంతేకాదు ఈ సినిమాలో ఏకంగా ఎనిమిది మంది మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్స్ తీసుకొచ్చి ప్రేక్షకులకు కన్నుల విందు చేస్తున్నారు.. ఇక ఏది ఏమైనా  ఈ సినిమా హిట్ అవడానికి అనూప్ రూబెన్స్ కూడా ఒక రకంగా కారణమని చెప్పవచ్చు. అందుకే అక్కినేని హీరో లకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు అనూప్ రూబెన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: